For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లైవ్ న్యూస్ ఛానెల్ లో విశ్వక్ సేన్ బూతులు.. గెట్ అవుట్ అంటూ పరువు తీసిన యాంకర్

  |

  ఇటీవల కాలంలో సినిమాల ప్రమోషన్స్ అనేది చాలా కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఎంత పెద్ద సినిమా అయినా సరే జనాలకు కనెక్ట్ అయితేనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో కొనసాగుతున్న టాక్. అందుకే సెలబ్రిటీలు కూడా వారి స్థాయిని లెక్కచేయకుండా జనాల్లోకి వెళ్లి మరి సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇటీవల విశ్వక్ సేన్ చేసిన ఒక ప్రాంక్ వీడియో కాంట్రవర్సీ గా మారింది. అతను చేసిన ప్రాంక్ వీడియో పై ఓ న్యూస్ ఛానెల్ పెట్టిన డిబేట్ లో గొడవలు కూడా జరిగాయి. లైవ్ లోనే విశ్వక్ బూతులు మాట్లాడడంతో యాంకర్ హీరోను బయటకు పంపించేసింది. అసలు ఏం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

   అందరి కంటే భిన్నంగా..

  అందరి కంటే భిన్నంగా..

  యువ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల కాలంలో మాస్ ఆడియన్స్ కు ఎక్కువగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. అతను అందరి కంటే భిన్నంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నూమా దాస్, హిట్, పాగల్ సినిమాలతో ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నాడు.

  సినిమా ప్రమోషన్స్ లో..

  సినిమా ప్రమోషన్స్ లో..


  అయితే బాక్సాఫీస్ వద్ద కూడా తన రేంజ్ పెంచుకోవాలి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్న విశ్వక్ మరికొన్ని రోజుల్లో మరొక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అశోక వనంలో అర్జున్ కళ్యాణం అనే సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో ప్రస్తుతం విశ్వక్ కొంచెం బిజీగా ఉన్నాడు.

  యువకుడి సూసైడ్ ప్రాంక్..

  యువకుడి సూసైడ్ ప్రాంక్..

  ఇక ప్రమోషన్లో భాగంగా విశ్వక్ సేన్ ఇటీవల ఒక ప్రాంక్ ను పబ్లిక్ ప్లేస్ నిర్వహించాడు. ఒక యువకుడు పెట్రోల్ పోసుకొని విశ్వక్ కారు ముందు ఆత్మహత్య చేసుకుంటాను అని హల్చల్ చేశాడు. ఒక విధంగా అది నిజమే అని జనాలు బ్రమపడ్డారు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోకు 34 ఏళ్ళయినా పెళ్లి కాలేదు అని అందుకే తను సూసైడ్ చేసుకుంటున్నాను అని డ్రామా చేశాడు. ఇక ఆ సినిమా చూసి అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకోవాలి అని మే 6వ తేదీన సినిమా రిలీజ్ అంటూ అక్కడే విశ్వక్ సినిమాను ప్రమోట్ చేశాడు. ఆ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.

   లైవ్ డిబేట్లో గొడవలు

  లైవ్ డిబేట్లో గొడవలు


  అయితే పబ్లిక్ ప్లేస్ లో సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా న్యూసెన్స్ చేయడం ఏమిటి అనే ఓ వర్గం వారు పెదవి విరుస్తున్నారు. అంతేకాకుండా పలు మీడియా ఛానల్స్ కూడా ఆ చిత్ర యూనిట్ పై అసహనం వ్యక్తం చేశాయి. ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ డిబేట్లో పాల్గొనగా అది కాస్తా గొడవలకు దారి తీసింది.

  వేలు చూపించి విశ్వక్ వార్నింగ్

  వేలు చూపించి విశ్వక్ వార్నింగ్

  తనను డిప్రెషన్ పర్సన్ పాగల్ సేన్ అని అనవద్దని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని విశ్వక్సేన్ లైవ్ డిబేట్ లోనే సదరు ఛానల్ యాంకర్ కు వేలు చూపించి మరీ హెచ్చరిక చేశాడు. దీంతో ఒక్కసారిగా యాంకర్ కు కోపం వచ్చేసింది. వెంటనే స్టూడియో నుంచి వెళ్లిపోవాలి అని కూడా అతనికి మొదట సైలెంట్ గానే చెప్పారు.

   ఇంగ్లీష్ లో F అంటూ బూతులు

  ఇంగ్లీష్ లో F అంటూ బూతులు

  ఇక ఆ న్యూస్ యాంకర్ కాస్త అసహనంతో గెట్ అవుట్ అని కూడా అనడంతో విశ్వక్ సేన్ కు మరింత కోపంతో ఇంగ్లీష్ లో బూతులు మాట్లాడాడు. f** అంటూ యాంకర్ ముందే బూతులు మాట్లాడటంతో ఆమె మరింత గట్టిగా గెటవుట్ అంటూ విశ్వక్సేన్ పరువు పోయే విధంగా మాట్లాడింది. మీరే పిలిచే ఇప్పుడు మీరే గెటవుట్ అంటున్నారు అంటూ విశ్వక్సేన్ కూడా అడిగే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా యాంకర్ తన సహనాన్ని కోల్పోయింది. దీంతో విశ్వక్ ఇక నుంచి తన పై న్యూస్ ఛానల్ లో ఇష్టం వచ్చినట్లు వార్తలు వేస్తారు అని చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

  అనుమానాలు ?

  అనుమానాలు ?

  మొత్తానికి ఆ న్యూస్ ఛానల్ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే గతంలో కూడా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా జరిగిన సందర్భాలు ఉన్నాయి. న్యూస్ ఛానల్స్ అలాగే చిత్రం యూనిట్ సభ్యులు ముందుగానే ప్లాన్ చేసుకొని మరి ఇలా గొడవలతో సినిమాలను ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అలాంటిదే జరిగి ఉండవచ్చు అని కూడా కొంత మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

  English summary
  Anchor Devi Nagavalli Gets Into Heated Arugument With Hero Vishwak Sen And Says Get Out Of The Show
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X