For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షార్ట్ డ్రెస్‌లో యాంకర్ హరితేజ రచ్చ: నడిరోడ్డు మీదే అలా.. వీడియో వైరల్

  |

  తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లుగా సందడి చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రం వెండితెరపైన కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో వెరీ టాలెంటెడ్ భామ హరితేజ ఒకరు. సీరియల్ నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ భామ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి తన సత్తా చాటుకుంది.

  ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక, ఆ మధ్య ఓ బిడ్డకు తల్లైన హరితేజ.. ప్రస్తుతం వరుసగా యూట్యూబ్ వీడియోలు, షోలు, సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇలాంటి సమయంలో తాజాగా హరితేజకు సోషల్ మీడియాలో ఓ హాట్ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  అలా వచ్చింది... ఇలా పాపులర్

  అలా వచ్చింది... ఇలా పాపులర్


  కూచిపూడి డ్యాన్సర్‌గా హరితేజ కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే 'మనసు మమత' సీరియల్‌లో నటించి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత 'ముత్యమంత పసుపు', 'రక్త సంబంధం', 'అభిషేకం', 'తాళి కట్టు శుభవేళ', 'శివ రంజనీ', 'కన్యాదానం' వంటి సీరియల్స్ చేసింది. తద్వారా పాపులర్ అయింది.

  స్టేజ్ మీదే హీరోయిన్‌కు ముద్దులు: ఏకంగా ఇద్దరితో.. ఆమె రియాక్షన్ చూశారంటే!

  హోస్టుగా మారి సత్తా చాటింది

  హోస్టుగా మారి సత్తా చాటింది


  వరుసగా టీవీ సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే హరితేజ 'అభిరుచి' అనే షోతో యాంకర్‌గా మారింది. ఆ తర్వాత 'ఫిదా.. మీ ఫేవరెట్ స్టార్‌తో', 'పండగ చేస్కో', 'సూపర్ సింగర్' వంటి ఎన్నో షోలను సైతం హోస్ట్ చేసింది. తద్వారా బెస్ట్ యాంకర్‌గా దూసుకెళ్లింది. ఇవి మాత్రమే కాదు.. సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లు ఇలా ఎన్నో హోస్ట్ చేసింది.

  బిగ్ బాస్ ఎంట్రీతో దూకుడుగా

  బిగ్ బాస్ ఎంట్రీతో దూకుడుగా


  వరుస షోలు, సినిమాలు చేస్తూ సాగిపోతోన్న సమయంలోనే హరితేజకు బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆమె అద్భుతమైన ఆటతీరుతో పాటు చలాకీగా ఉంటూ ఆకట్టుకుంది. తద్వారా ప్రేక్షకుల హృదయాలను సైతం గెలుచుకుంది. అంతేకాదు, ఓటింగ్‌లోనూ సత్తా చాటుతూ ఫినాలేకు చేరుకుంది. ఇందులో గెలవకున్నా ఆఫర్లను మాత్రం అందుకుంది.

  టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

  మూవీల్లో సత్తా... వరుస ఆఫర్లు

  మూవీల్లో సత్తా... వరుస ఆఫర్లు


  బుల్లితెరపై చాలా కాలం హవాను చూపించిన హరితేజ.. సినిమాల్లోకి కూడా ఎంటరైంది. 'ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం.. దిగ్విజయంగా సాగుతోంది. 'అఆ'లో ఆమె చేసిన పాత్ర బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక, ఆమె కెరీర్‌లో 'దమ్ము', 'గబ్బర్ సింగ్', 'యూటర్న్', 'హిట్', 'ఎఫ్2', 'జాంబీ రెడ్డి' చిత్రాలు పేరు తెచ్చి పెట్టాయి.

  తల్లైన అమ్మడు... చాలా గ్యాప్

  తల్లైన అమ్మడు... చాలా గ్యాప్


  దీపక్‌కు హరితేజ ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ పాప పుట్టింది. ఈ కారణంగా ఆమె చాలా కాలం సినిమాలు, సీరియళ్లు, షోలు పెద్దగా చేయలేదు. కానీ, 'హరి కథలు' అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో ఎన్నో వీడియోలు చేస్తూ అలరించింది. మళ్లీ 'గని' మూవీతో కెరీర్ కంటిన్యూ చేసింది. ఇప్పుడు 'భోళా శంకర్' మూవీలో నటిస్తోంది.

  Eesha Rebba అందాల అరాచకం: అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

  సోషల్ మీడియాలో ఫల్ బిజీగా

  వరుసగా షోలు, సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతోన్న హరితేజ.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే నిత్యం తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. మొత్తానికి ఇంటర్నెట్‌లో తరచూ హైలైట్ అవుతూ దూసుకెళ్తోంది.
  హాట్ డ్యాన్స్ వీడియో వదిలింది

  హాట్ డ్యాన్స్ వీడియో వదిలింది


  సోషల్ మీడియాలో ఎంతో కాలంగా రచ్చ చేస్తోన్న హరితేజ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె చిన్న గౌను మాత్రమే ధరించి కనిపించింది. ప్రస్తుతం ఫారెన్ ట్రిప్‌లో ఉన్న ఈ భామ.. అక్కడి రోడ్లపై హాట్ హాట్ ఫోజులతో డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Anchor and Actress Hari Teja Very Active in Social Media. Recently She Shares Hot Dance Video in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X