పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ.. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా
తెలుగు టాప్ యాంకర్‌గా, నటిగా రాణిస్తున్న హరితేజ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులు, సన్నిహితులు, స్నేహితులతో పంచుకొన్నారు. లాక్‌డౌన్ సమయంలో తాను తల్లిని కాబోతున్నాననంటూ తన ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించిన విషయం తెలిసిందే. హరితేజ తాజా పోస్టు గురించి, వ్యక్తిగత విషయాల గురించి వివరాల్లోకి వెళితే...

టాప్ యాంకర్‌గా బుల్లితెరపై
తెలుగు టెలివిజన్ రంగంలో పలు సీరియల్స్‌లో నటించడం ద్వారా హరితేజ గుర్తింపు తెచ్చుకొన్నారు. ఓవైపు సీరియల్స్‌లో నటిస్తూనే యాంకర్‌గా పాపులారిటి సంపాదించారు. మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం లాంటి సీరియల్స్ మంచిగా పాపులారిటీని తెచ్చి పెడితే.. ఫిదా, పండుగ చేస్కో, సూపర్ సింగర్ లాంటి షోలు ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేలా చేశాయి.

వెండితెరపై తనదైన శైలిలో
టెలివిజన్ రంగంలో వచ్చిన పాపులారిటీతో సినిమా రంగంలోకి హరితేజ ప్రవేశించారు. ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే, అందరి బంధువయ్యా, దమ్ము, 1 నేనొక్కడినే, అఆ.., విన్నర్, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల ద్వారా నటిగా నిలదొక్కుకొన్నారు. యూటర్న్, రాజా ది గ్రేట్, సమ్మోహనం సినిమాలు మరింత పేరు తెచ్చిపెట్టాయి.
అరబిక్ సుందరిగా మారిన అదా శర్మ... అందంతో ఆకర్షిస్తూ...

బిగ్‌బాస్‌తో మరో రేంజ్‌కు
ఇలా సినిమా, టెలివిజన్ రంగంలో రాణిస్తున్న హారితేజకు బిగ్‌బాస్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. బిగ్‌బాస్‌లో తనదైన నటనతో ఆమె బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకొన్నారు. తనలో టాలెంట్‌ను, హరికథా ప్రతిభను చాటుకొన్నారు. ఇలా ప్రొఫెషనల్ లైఫ్‌ను సక్సెస్ ఫుల్‌గా కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆస్వాదించారు.

లాక్‌డౌన్‌లో ప్రెగ్నెంట్ అంటూ
లాక్‌డౌన్‌లో తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అదే సమయంలో ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌తో నెటిజన్లను, అభిమానులను ఆకట్టుకొన్నారు. ఆ ప్రెగ్నెన్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపుతూ సందేశాలు పంపారు.

ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ దంపతులు
ఇలాంటి భావోద్వేగాల మధ్య యాంకర్ హరితేజ ఏప్రిల్ 5వ తేదీన పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. హరితేజ దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, పాప సురక్షితంగా ఉన్నారనే సన్నిహితులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు కంగ్రాట్స్ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











