యాంకర్ హరితేజకు చేదు అనుభవం.. ప్రెగ్నెన్సీ సమయంలో...

యాంకర్‌గా, నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న హరితేజ త్వరలోనే మాతృత్వ అనుభవాన్ని పొందబోతున్నారు. తల్లిగా ప్రేమను కురిపించడానికి సిద్ధమవుతున్న ఈ యాంకర్‌ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేయడంపై తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. హరితేజకు ఎదురైన ట్రోలింగ్ గురించి వివరంగా..

తెల్లచీరలో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ (ఫొటోలు)

బుల్లితెరపై హరితేజ కెరీర్

బుల్లితెరపై హరితేజ కెరీర్

టెలివిజన్ రంగంలో మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం లాంటి పాపులర్‌ షోలతో ఆకట్టుకొన్న హరితేజ తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. బుల్లితెర మీదనే కాకుండా వెండి తెర మీద కూడా హస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. బిగ్ బాస్ తర్వాత ఫిదా, పండుగ చేస్కో, సూపర్ సింగర్ షోలతో బిజీగా మారిపోయారు.

బిగ్‌బాస్ తర్వాత హరితేజ

బిగ్‌బాస్ తర్వాత హరితేజ

ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తొలి సీజన్‌లో హరితేజ పాల్గొనడమే కాకుండా తన అద్బుతమైన ప్రతిభను చాటుకొన్నారు. హరికథ చెప్పడంలోనూ, తనదైన హావభావాలతో టెలివిజన్ రియాలిటీ షోను మరో లెవెల్‌కు తీసుకెళ్లడంలో తన వంతు పాత్రను పోషించారు. ఆ తర్వాత నటిగా తెలుగు సినిమా రంగంలో మంచి పాత్రలను పోషిస్తూ ఆకట్టుకొంటున్నారు.

 ప్రెగ్నెన్సీ సమయంలో ఫోటోషూట్

ప్రెగ్నెన్సీ సమయంలో ఫోటోషూట్

అయితే లాక్‌డౌన్ సమయంలో హరితేజ గర్భవతి అయ్యారు. త్వరలోనే తల్లిని కాబోతున్నాననే వార్తను తన అభిమానులు, శ్రేయోభిలాషులతో పంచుకొన్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయగా హరితేజ ధరించిన డ్రస్పై నెటిజన్లు ఘాటైన కామెంట్లు చేశారు.

 నచ్చినట్టు దుస్తులను ధరించడం

నచ్చినట్టు దుస్తులను ధరించడం


సోషల్ మీడియాలో తనపై కామెంట్ చేసిన వారి గురించి హరితేజ వెల్లడిస్తూ.. నాకు నచ్చిన బట్టలు వేసుకోవడం నా ఇష్టం. ప్రతీ రంగంలో ఉండే మహిళలకు తమకు నచ్చిన విధంగా ఉండే హక్కు ఉంది. వారి వారి సౌలభ్యం కోసం ఎలాంటి దుస్తులైనా ధరించడానికి అవకాశం ఉంది. దానిని మరొకరు కాదనడానికి హక్కు లేదు అంటూ హరితేజ ఘాటుగా స్పందించారు.

 ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు

ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు

ఎవరిపైనైనా నచ్చినట్టు కామెంట్లు చేసే హక్కు ఎవ్వడికి లేదు. అది మీ సంస్కారానికి సంబంధించిన విషయం. అబ్బాయిలను ఈ విషయంలో పక్కన పెడితే అమ్మాయిలు కూడా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అని అందుకే అన్నారేమో అంటూ హరితేజ తీవ్రంగా స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X