యాంకర్ ఝాన్సీపై కుట్ర.. వాళ్లందరికీ పోటీ అవుతుందని.. అసలు నిజం ఇదే!
యాంకర్ గా, నటిగా ఝాన్సీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెల్లూరు, తెలంగాణ లాంటి ప్రత్యేకమైన యాసలో డైలాగ్స్ అద్భుతంగా చెప్పడం ఝాన్సీ ప్రత్యేకత. యాంకరింగ్ వృత్తిని కొనసాగిస్తూనే నటిగా అవకాలు అందుకుంది. ఝాన్సీ ఎక్కువగా ఎంటర్ టైనింగ్ షోలకు యాంకరింగ్ చేయలేదు. సామజిక చైతన్యం కలిగించే కార్యక్రమాలకు ఝాన్సీ పనిచేసింది. జోరుగా కొనసాగుతున్న తన యాంకరింగ్ వృత్తిని ఝాన్సీ ఇటీవల వదలిపెట్టింది. అందుకు గల కారణాలని ఝాన్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

యాంకర్ ఝాన్సీపై కుట్ర
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీపై కుట్రపన్ని యాంకరింగ్ నుంచి వైదొలిగేలా కొంతమంది చేశారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమేనా అనే ప్రశ్న ఝాన్సీకి ఎదురైంది. మిగిలిన యాంకర్స్ కు కాంపిటీటర్ గా మారుతోందని ఝాన్సీపై కుట్ర పన్నినట్లు ఉహాగానాలు ఉన్నాయి. ఈ వార్తలపై ఝాన్సీ స్పందిస్తూ అలాంటిదేమి లేదని తెలిపింది. యాంకరింగ్ నుంచి వైదొలగడం తాను తీసుకున్న నిర్ణయమే అని ఇందులో ఎవరి బలవంతం లేదని ఝాన్సీ తెలిపింది.

గత ఏడాది ఫిబ్రవరిలో
వ్యక్తిగత కారణాల వలన యానకరింగ్ నుంచి వైదొలగాలని గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నా. నాకు ఇప్పటి వరకు యాంకర్ గా అవకాశం ఇచ్చిన అన్ని ఛానల్స్ కు మెయిల్ పెట్టా. తాను ఎందుకు యాంకరింగ్ నుంచి తప్పుకుంటున్నానో వివరించానని ఝాన్సీ తెలిపారు. ఇది సడెన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుని గత ఏడాది ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఝాన్సీ తెలిపారు.

డబ్బు వచ్చే కార్యక్రమాలు కాదు
తాను ఏ కార్యక్రమానికి యాంకర్ గా పనిచేసినా చాలా కమిట్మెంట్ తో చేసానని ఝాన్సీ తెలిపింది. చేతన, నవీన లాంటి కార్యక్రమాలకు దశాబ్దకాలం పనిచేశానని ఝాన్సీ చెప్పుకొచ్చింది. నేను చేసిన కార్యక్రమాలు డబ్బు తీసుకొచ్చే ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాలు కాదు. జనాలు ఎగబడి చూసే కార్యక్రమాలు కూడా కాదు. సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు అని ఝాన్సీ తెలిపింది.

నా ప్రవర్తన నచ్చేది కాదు
ఎంటర్ టైన్మెంట్ షోలకు కూడా చాలా అవకాశాలు వచ్చాయి. కానీ కొన్నింటిని నేనే వదులుకున్నా. మరో కొన్ని షోలలో నా ప్రవర్తన నచ్చక తీసుకోలేదు. ఈమెకు మరీ విలువలు ఎక్కువ అని సెటైర్లు వేసేవారు అంటూ ఝాన్సీ తెలిపింది. ఎవరేమనుకున్నా తాను చేసిన షోలన్నీ తనని వ్యక్తిత్వం పరంగా నిలబెట్టాయని ఝాన్సీ తెలిపింది.


Click it and Unblock the Notifications











