twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యాంకర్ ఝాన్సీ, సింగర్ సునీతల రెండో పెళ్లిపై అలీ ప్రశ్నలు.. ఒక్కసారిగా ఎమోషనల్!

    |

    సినిమా వరల్డ్ లో చాలా వరకు స్టార్స్ జీవితాలు కలర్ఫుల్ గానే కనిపిస్తాయి. కానీ అది కెమెరా ముందు వరకే. వారికి కూడా పర్సనల్ లైఫ్ లో కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. రూమర్స్ కారణంగానే కాకుండా సొంత భాగస్వామితో ఎక్కువగా ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ వంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో తెలియని కష్టాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. కానీ వారు మాత్రం కఠిన పరిస్థితులని ఎదుర్కొంటూ చెరగని చిరునవ్వుతో ముందుకు సాగుతున్నారు.

     అలీతో యాంకర్, సింగర్

    అలీతో యాంకర్, సింగర్

    ఇక ఇటీవల సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ అలీతో సరదాగా జరిగిన టాక్ షోలో పాల్గొన్నారు. త్వరలో ప్రసారం కానున్న ఆ షో ప్రోమోని ఇటీవల విడుదల చేయగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎందుకంటే అందులో సునీతతో పాటు ఝాన్సీ కూడా సమానంగా పాడారు, నవ్వించారు. అలాగే చివరికి కొన్ని భావోద్వేగా పరిస్థితుల గురించి తలచుకోని కన్నీరు కూడా పెట్టుకున్నారు.

    రూమర్స్ పై ఆగ్రహం

    రూమర్స్ పై ఆగ్రహం

    సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ ఇద్దరు కూడా దాదాపు ఒకే రకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారనే చెప్పాలి. భర్త నుంచి విడిపోయిన వీరు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పిల్లల జీవితాలను చూసుకుంటూ బ్రతికేస్తున్నారు. చాలా సార్లు ఈ స్టార్స్ కి సంబంధించిన రూమర్స్ రాగా కొన్నిసార్లు ఆ రూమర్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    తాగేసి పాడితే ఎలా?

    తాగేసి పాడితే ఎలా?

    ఇక షో విషయానికి వస్తే.. అలీ తన పంచ్ లతో మొదట ఈ ఇద్దరిని బాగానే నవ్వించారు. ముఖ్యంగా సింగర్ సునీతతో అలీ ప్రయోగాత్మకమైన పాటలు పాదించారు. తాగేసి పాడితే ఎలా ఉంటుందో సునీత ఇమిటేట్ చేసిన విధానం ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అదే విదంగా ఝాన్సీ కూడా తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ పాడే ప్రయత్నం కూడా చేశారు.

    Recommended Video

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
    ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరిగాయి..

    ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరిగాయి..

    ఇక ప్రోమో చివరలో అలీ వేసిన ప్రశ్నకు సరదాగా ఇద్దరిలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. సునీత, ఝాన్సీలకు మళ్ళీ పెళ్లి ఎప్పుడు అనే అడగడంతో మా ఇద్దరికి పెళ్లి ఏంటి అలీ గారు అంటూ ఝాన్సీ వేసిన పంచ్ కి అందరూ నవ్వేశారు. ఇక చివరికి ఎమోషన్ విషయాలతో ఇద్దరి కళ్ళలో నీళ్లు తిరిగాయని తెలుస్తోంది. మరి ఫుల్ ఎపిసోడ్ లో ఈ ఇద్దరు స్టార్స్ వారి జీవితాల గురించి ఇంకా ఎలాంటి విషయాలు చెబుతారో చూడాలి.

    English summary
    Everyone wants to reach the top of their talent in the film industry. There are plenty of overweight people who are trying to win in life. There are many people who deliberately target and attempt to hurt their career. But Singer Sunita, who has made a special mark in the South industry as a singer, has had such bitter experiences
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X