twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరో చెప్పింది.. ఎక్కడో చూసిందా రాస్తారా? రూమర్లపై యాంకర్ ఝాన్సీ సీరియస్

    |

    యాంకర్ ఝాన్సీ ఆరోగ్యంపై మీడియాలో రకరకాల కథనాలు వస్తుండటంతో ఆమె ప్రత్యక్షంగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు. తెలుగు బుల్లితెరపై పరివార్ లీగ్ 2 అనే రియాలిటీ షోకు యాంకర్ ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్‌ను ఝాన్సీ నేతృత్వంలో షూట్ చేశారు. ఆ షోలో పాల్గొన్న టెలివిజన్ నటి నవ్య స్వామికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ కార్యక్రమంలో పాలొన్న వారిని, అలాగే యూనిట్ సభ్యులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఝాన్సీ ఆరోగ్యంపై కొన్ని రూమర్లు వీర విహారం చేశాయి. దాంతో ఆమె స్వయంగా వీడియోను రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. ఝాన్సీ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను...

    ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాను...


    నేను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నా ఆరోగ్యం గురించి చాలా మంది వాకబు చేస్తూ శ్రద్ద తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఆరోగ్యం విషయంలో నా పోస్టు చూడకుండా కన్‌ఫ్యూజ్ అయిన వారికి, కొన్ని వెబ్‌సైట్లకు సరైన సమాచారం ఇవ్వడానికి ఈ వీడియోను చేశాను. ప్రస్తుతం ఇప్పుడు కరోనావైరస్ భయాలు అందరిని వెంటాడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటమనేది అందరికి ముఖ్యమైన విషయం అంటూ యాంకర్ ఝాన్సీ తాజా వీడియోలో వెల్లడించారు.

    రూమర్లపై క్లారిటీ ఇవ్వాలని అనుకొంటున్నా

    రూమర్లపై క్లారిటీ ఇవ్వాలని అనుకొంటున్నా

    నా ఆరోగ్యం విషయంలోను, ఐసోలేషన్, క్వారంటైన్ విషయంలో వస్తున్న రూమర్లపై కొంత క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాలనుకొంటున్నాను. సోషల్ మీడియాలో నా మెసేజ్‌ను సరిగా అర్ధం చేసుకొని, నిజాలు తెలుసుకొని వాస్తవాలు రాయాలి. ఆ విషయంపైనే నేను నా ఆరోగ్యం గురించి మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను సరిదిద్దాలని అనుకొంటున్నాను అని ఝాన్సీ అన్నారు.

    కరోనాకు భయపడాలా అంటే

    కరోనాకు భయపడాలా అంటే

    కరోనావైరస్ విషయంలో వయసు మీరిన వాళ్లకు భయాందోళనలు ఉండటం సహజం. వారికి కొన్ని రకాల ఆరోగ్యపరమైన లోపాలు ఉంటాయి కాబట్టి వారు భయాందోళలనకు గురి కావాల్సి ఉంటుంది. నాలాంటి మధ్య వయసు వాళ్లు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. నా విషయంలో నేను ఫిటినెస్‌ను ఎప్పుడూ ఫాలో అవుతుంటాను. పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకొంటాను కాబట్టి.. నేను కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు అని ఝాన్సీ తెలిపారు.

    నేను ఎందుకు ఐసోలేషన్‌లో ఉన్నానంటే..

    నేను ఎందుకు ఐసోలేషన్‌లో ఉన్నానంటే..

    ఇక నేను ఐసోలేషన్‌లో ఎందుకు ఉన్నానంటే.. నేను షూట్ చేసిన ప్రోగ్రాంలో ఇద్దరికి కరోనావైరస్ వచ్చింది. ఇప్పుడు కరోనావైరస్ రావడమేనేది చాలా సాధారణమైన విషయం. మనతో పనిచేసే వారికి కరోనా ఉందనే విషయం వాళ్లు చెబితే గానీ మనకు తెలియదు. ఒకవేళ ఎవరైనా టెస్టులు చేసుకొని చెబితే వాళ్లు దేవుళ్లుగా భావించాల్సిందే. దాంతో మన జాగ్రత్తలో మనం ఉంటాం అని ఝాన్సీ తెలిపారు.

    కరోనా వచ్చే అవకాశం ఉందనే విషయం..

    కరోనా వచ్చే అవకాశం ఉందనే విషయం..


    కరోనా వచ్చే భయం ఉన్నప్పుడు రెండు వారాలు బయట తిరగకుండా ఇంట్లో ఉండటం మంచిదేనని భావించాను. నా ఇంట్లో ఇద్దరు పెద్దలు ఉన్నారు కాబట్టి వారికి ఎలాంటి అపాయం కలుగకుండా నేను ఐసోలేషన్‌లో ఉన్నాను. కాబట్టి నేను ఎందుకు బయటకు రాలేదనే విషయాన్ని నా ఇన్స్‌టాగ్రామ్‌లో అధికారికంగా వెల్లడిస్తున్నాను. కాబట్టి నాకు ఎలాంటి కరోనా లేదనే విషయం అర్ధమవుతుందని అనుకొంటున్నాను అని ఝాన్సీ పేర్కొన్నారు.

    కరోనావైరస్ సోకిందని తేలితే స్వయంగా వెల్లడిస్తాను

    కరోనావైరస్ సోకిందని తేలితే స్వయంగా వెల్లడిస్తాను


    కొద్ది రోజుల తర్వాత నేను రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొంటాను. ఒకవేళ కరోనా ఉందనే తేలితే అధికారికంగా బయటకు వెల్లడిస్తాను. అంతేగానీ ఎక్కడెక్కడో రూమర్లు విని, ఎవరెవరో చెప్పింది విని, ఎక్కడో చూసిన గాసిప్స్‌తో వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరో వారంలో నేను మళ్లీ షూటింగ్స్‌కు వెళ్తాను. కరోనా అనేది ఇక ముందు ఎప్పుడైనా మనపై దాడి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకొంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఇక మనముందు ఉన్న కర్తవ్యం అని ఝాన్సీ తెలిపారు.

    English summary
    Anchor Jhansi has given clarity on her health thru video in Instagram account. Jhansi said, She was in self isolation after two people tested coronavirus positive in Parivar league 2. She upset over rumours in media on her health.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X