నా పొలంలో మొలకలొచ్చాయ్.. అలాంటి వాటికి సిగ్గుపడొద్దు.. యాంకర్ ఝాన్సీ కామెంట్స్
బుల్లితెరపైనా, వెండితెరపైనా తనదైన శైలిలో ఆకట్టుకుంది యాంకర్ ఝాన్నీ. ఎన్నో యేళ్లుగా యాంకర్, నటి, హోస్ట్‌గా ఇలా ఎన్నో కోణాల్లో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నేళ్లు అంతగా వెలుగులోకి రాకపోయినా.. మళ్లీ మునుపటి వైభవాన్ని సంతరించుకుంటోంది. సినిమాలు, స్పెషల్ షోలు, పలు ఈవెంట్స్ హోస్టింగ్‌లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఝాన్నీ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఆమె షేర్ చేసిన పోస్ట్‌లు తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
Recommended Video

ఆ మధ్య బిగ్‌బాస్ విన్నర్‌పైనా..
బిగ్‌బాస్ మూడో సీజన్ ఫలితంపైనా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేసింది ఝాన్సీ. శ్రీముఖి విన్నర్ అవుతుందని భావించిన ఝాన్నీ.. అది జరగ్గకపోవడంతో స్త్రీ పక్షపాతం, స్త్రీవాదం అంటూ సెటైర్స్ వేసింది. అయినా టైటిల్ గెలవడం కాద.. మనసులను గెలిచావ్ అంటూ శ్రీముఖికి మద్దతుగా నిలిచింది.
నా పొలంలో మొలకలు వచ్చాయ్..
ఝాన్నీ తాను నాటిన విత్తనాలు, వచ్చిన మొలకల గురించి చెబుతూ.. ‘నా పొలంలో మొలకలు వచ్చాయ్.. హోమ్ గార్డెన్ ఛాలెంజ్.. విత్తనాలు నాటండి.. ఇంట్లో వారికి తినిపించండి.. యాంకర్ శిల్పా, గాయత్రీ భార్గవి, ఆర్జే కాజల్‌కు ఈ ఛాలెంజ్ విసురుతున్నా'ను అంటూ పోస్ట్ చేసింది.

ఇలా బయటకు వచ్చా..
ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అందరూ ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తరువాత ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టానని ఓ ఫోటోను షేర్ చేసింది. తాను ధరించి వాటి గురించి, తీసుకున్న జాగ్రత్తల గురించి చెబుతూ ఓ పోస్ట్ చేసింది.
అలాంటి వాటికి సిగ్గుపడొద్దు..
భయటకు వచ్చిన ఝాన్నీ ఫేస్ మాస్క్, ఫేస్ షీల్డ్ పెట్టుకుని రావడంపై స్పందిస్తూ.. ‘ఇలా వచ్చినప్పుడు అంతా ఓ రకంగా చూస్తారు..నవ్వొచ్చు కూడా జోకులు కూడా వేసుకోవచ్చు కానీ జాగ్రత్తలు తీసుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడొద్దు. మన ఆరోగ్యం ముందు అవన్నీ చిన్నవే. మనకు ఎలాంటి సింప్టమ్స్ లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం' అంటూ ఓ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











