అఖిల్, మోనాల్ లవ్ ట్రాక్ అలాంటిది.. వారిద్దరి మధ్య బఫూన్ అయ్యా.. యాంకర్ లాస్య
బిగ్‌బాస్ తెలుగు ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన లాస్య ఇంటిలోని విషయాలను బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో పంచుకొన్నారు. ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ప్రధానంగా మోనాల్, అఖిల్ గొడవల గురించి ఇంట్రెస్టింగ్ అంశాలను చెప్పారు. ఇంకా లాస్య ఏం చెప్పారంటే..

ఇంటిలో రెండు లవ్ ట్రాక్స్
ఇంటిలో రెండు లవ్ ట్రాక్‌లు నడుస్తున్నాయనేది మీకు, మాకు తెలుసు. ఒకటి మోనాల్, అఖిల్‌ది.. మరోటి అరియానా, అవినాష్‌ది. అయితే మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ లవ్ ట్రాక్ మాత్రం హైలెట్. వాళ్లిద్దరు గొడవ పడినప్పుడు నా వద్దకు వచ్చి తమ బాధను చెప్పుకొనే వారు. అయితే నేను విని చాలా సార్లు వాళ్లను కలిపేందుకు ప్రయత్నించాను అని లాస్య చెప్పారు.

అఖిల్, మోనాల్ గొడవపడినప్పుడు
ప్రతీ సారి గొడవ పడినప్పుడు అఖిల్, మోనాల్ నా వద్దకు వచ్చి తమ గొడవను చెప్పే వారు. అఖిల్ తన వెర్షన్ చెబితే కరెక్ట్ అనిపించేది. మోనాల్ చెబితే ఆమె వెర్షన్ కూడా కరెక్ట్ అనిపించేది. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం కాకపోయేది అని లాస్య అన్నారు.

గొడవ పడుతారు.. వాళ్లే కలుసుకొంటారు..
అయితే మోనాల్, అఖిల్ గొడవ పడి కాసేపు ముఖం చాటేసేవారు. కానీ మళ్లీ వెంటనే కలిసిపోయేవారు. వాళ్లు గొడవ పెట్టుకొంటారు. వాళ్లే కలుసుకొంటారనేది నాకు అప్పుడు అనిపించింది. వాళ్లేదో గొడవ పెట్టుకొన్నారు. మనం కలిపేయాలని ప్రయత్నించి చాలా సార్లు బఫూన్ అయ్యాను అంటూ అఖిల్, మోనాల్ లవ్ ట్రాక్ గురించి చెప్పారు.

మోనాల్ తీరు అర్థం కాకుండా
మోనాల్ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకపోయేది. కాకపోతే గత నాలుగైదు వారాల నుంచి బాగా అర్థమవుతున్నది. ఒకరిపై ఫిర్యాదు చేసి వారితోనే బాగా ఉంటుంది. ఆమె ప్రవర్తన నాకు సరిగా అర్థం కాలేదు. కొన్నిసార్లు మనకెందుకు అంటూ వదిలేశాను. కానీ ఇప్పుడిప్పుడే నేను కొంచెం అర్థం చేసుకొన్నాను అని లాస్య తన అనుభవాలు చెప్పింది.
Recommended Video

అమ్మా రాజశేఖర్ కన్నింగ్ స్మైల్ అంటూ
అమ్మా రాజశేఖర్ మంచి ఎంటర్‌టైనర్. అయితే అందర్నీ ఇమిటేట్ చేస్తుంటారు. తాను చేసే విషయాలు చూసి నేను నవ్వే దానిని. అది చూసి లాస్యది కన్నింగ్ స్మైల్ అంటూ హోస్ట్ నాగ్‌కు చెప్పడంతో నేను కొంత బాధపడ్డాను. కానీ మాస్టర్ మంచి కుక్. చేపల కూర బాగా వండుతాడు అని లాస్య తెలిపారు.


Click it and Unblock the Notifications











