Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాప్ 5లో ఆ ఐదుగురికి ఛాన్స్.. టాప్ 2లో ఆ ఇద్దరికే చోటు.. యాంకర్ లాస్య
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో యాంకర్ లాస్య తన సత్తాను చాటుకొన్నది. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకొన్నారు. ఇంటి నుంచి 11వ వారం బయటకు రావడం తెలిసిందే. ఈ సందర్భంగా తన అనుభవాలను పలు మీడియా సంస్థలతో పంచుకొన్నారు. ఈ సందర్భంగా టాప్ 2, టాప్ 5 కంటెస్టెంట్ల గురించి వెల్లడిస్తూ..
ప్రేక్షకులే నిర్ణేతలు.. ఓటింగ్ మాత్రమే
బిగ్‌బాస్ ఇంటిలో ఉండాలా? వద్దా అనేది మన నిర్ణయం కాదు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారమే కంటెస్టెంట్ల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. నన్ను 11 వారాల పాటు ఉంచారంటే.. నా గేమ్ బాగా ఉండటం వల్లే అనేది నా అభిప్రాయం. అందుకే నేను ఎలిమినేట్ అయినా నేను ఏడువలేదు అని యాంకర్ లాస్య అన్నారు.
టాప్ 2లో ఆ ఇద్దరే ఉంటారని
ఇక ఇంటి సభ్యుల్లో ఎక్కువగా విన్నింగ్ ఛాయిస్ మాత్రం అభిజిత్, సోహెల్ సయ్యద్‌కు ఉన్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో కూడా నాకు వారిద్దరే టాప్ పొజిషన్లో ఉన్నారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల్లో, మెజారిటీ ప్రేక్షకుల్లో అదే అభిప్రాయం ఉందనేది తెలిసింది అని యాంకర్ లాస్య పేర్కొన్నారు.
ఉమెన్ కంటెస్టెంట్ విజేతగా నిలువాలని..
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్లో ఉమెన్ కంటెస్టెంట్ విజేతగా నిలువాలని నా అభిప్రాయం. హారిక విజేతగా నిలిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంటిలో అరియానా కూడా బాగా ఆడుతున్నది. అవినాష్ కూడా బాగా ఆడుతున్నాడు. కొన్ని వారాలుగా అవినాష్ వెనకబడి ఉన్నాడు అని యాంకర్ లాస్య తెలిపారు.
Recommended Video
టాప్ 5లో వీరే ఉంటారని..
అభి, హారిక, సోహెల్, అఖిల్, మోనాల్ లేదా అరియానా ఉండటానికి అవకాశం ఉంటుంది. అవినాష్ ఉంటే నాకు ఇంకా హ్యాపీ. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్లు టాప్ 5లో ఉండాలన్నది నా ఇష్టం. అవినాష్‌కు నాకు బిగ్‌బాస్‌కు ముందే నాకు పరిచయం ఉంది. కాబట్టి నాకు అవినాష్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని యాంకర్ లాస్య పేర్కొన్నారు.