రవితో షో చేస్తే ఏం అనుకుంటారో అని భయపడ్డాను.. లాస్య కామెంట్స్ వైరల్

బుల్లితెరపై యాంకర్ రవి లాస్యది ఓ సంచలనం. ఈ ఇద్దరూ కలిసి చేసిన షో ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.. ఇద్దరూ విడిపోయి ఎవరి షోలు వారు చేసుకున్న సమయంలోనూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు విడిపోయారంటూ నిత్యం ఏదో రకమైన రూమర్ బయటకు వచ్చేది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసిపోయారు.

ఐదేళ్ల తరువాత..

ఐదేళ్ల తరువాత..

యాంకర్ రవి లాస్య ఇద్దరూ కూడా ఐదేళ్ల తరువాత ఒకే స్టేజ్ మీదకు వచ్చారు. అది కూడా స్టార్ మా ఆధ్వర్యంలో చేస్తోన్న సంక్రాంతి ఈవెంట్ కోసం. బిగ్ బాస్ కంటెస్టెంట్లను పిలుచుకుని వచ్చిన స్టార్ మా యూనిట్ ఇలా స్పెషల్ ప్లాన్ చేశారు.

 అందరి దృష్టి..

అందరి దృష్టి..

రవి లాస్య మధ్య ఉన్న గొడవలు, కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. అలా ఈ ఇద్దరినీ ఒకే స్టేజ్ మీదకు తీసుకొని వస్తే కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించగలమని స్టార్ మా అనుకున్నట్టుంది. నిజానికి వారు అనుకున్నదే జరిగింది. స్టేజ్ మీదే రవి క్షమాపణలు అడగడం, జున్ను గాడిని నవ్వించే ప్రయత్నం చేయడం అన్నీ కూడా ఆకట్టుకున్నాయి.

తాజాగా లైవ్‌లో..

తాజాగా లైవ్‌లో..

లాస్య తాజాగా లైవ్‌లోకి వచ్చింది. అక్కడ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. అందులో చాలా మంది సంక్రాంతి ఈవెంట్ గురించి అడిగారు. లాస్య రవి కాంబో గురించి అందరూ మాట్లాడారు. అసలైన టామ్ అండ్ జెర్రీ వచ్చారంటూ ప్రశంసలు కురిపించారు.

లాస్య ఎమోషనల్..

లాస్య ఎమోషనల్..

అయితే ఆ కాంబోను అంతలా ఆదరించడం చూసి లాస్య ఎమోషనల్ అయింది. ఐదేళ్ల తరువాత ఇలా వస్తున్నాం.. నేను రవితో కలిసి యాంకరింగ్ చేస్తే జనాలు ఏదైనా అనుకుంటారేమో.. రిసీవ్ చేసుకుంటారో లేదో అని భయపడ్డాను కానీ అన్ని వైపుల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.. చాలా ఆనందంగా ఉంది అంటూ లాస్య చెప్పుకొచ్చింది.

హిమజతో షాపింగ్..

హిమజతో షాపింగ్..

ఇక కొందరు మాత్రం ఆ ఈవెంట్‌లో లాస్య వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడారు. డిజైన్, అవుట్ ఫిట్ అంతా బాగుందని అన్నారు. అయితే దాని వెనుకున్న సీక్రెట్ గురించి లాస్య చెప్పింది. ఆ డ్రెస్ కోసం హిమజ తాను కలిసి షాపింగ్ చేశానని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X