అరియానాతో అలాంటి గొడవలు.. అందుకే ఆమెపై కోపం.. బయటపెట్టిన యాంకర్ లాస్య
బిగ్‌బాస్ ఇంటి నుంచి 11వ వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన యాంకర్ లాస్య బిగ్‌బాస్ తెలుగు 2 సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో తన భావాలను పంచుకొన్నది. ఇంటిలోని సభ్యులు, తన గేమ్ గురించి, నామినేషన్ ప్రక్రియ గురించి పలు విషయాలను వెల్లడించింది. అరియానాతో ఉన్న గొడవలు గురించి చెబుతూ..

అరియానా బోల్డ్, స్ట్రాంగ్
అరియానాలో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. బోల్డ్‌గా కనిపించడమే కాకుండా మాట్లాడుతుంది. నిజాయితీగా ఉంటుంది. చూడటానికి సన్నగా కనిపించినా మానసికంగా చాలా బలమైనది. నాకు వ్యక్తిగతంగా కోపం ఎప్పుడూ లేదు అని యాంకర్ లాస్యతో చెప్పుకొచ్చారు.

మా ఇద్దరి మధ్య గొడవలతో
మా ఇద్దరికి మధ్య గొడవలు వచ్చాయి. కానీ అవి కేవలం నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మా మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. ఓ సారి హిట్ మెన్ టాస్క్ సందర్భంగా ఆమెకు అవసరం లేకున్నా పరుగెత్తికెళ్లి నన్ను నామినేట్ చేసింది. నా మీద ఎందుకు ఇంత స్పెషల్‌లా అనిపించిందని లాస్య వెల్లడించారు.

అరియానా నాకు పోటి కాదు..
అరియానా నాకు కాంపిటీటర్ కాదని ఎందుకు అన్నానంటే.. ఓ సందర్భంగా నామినేషన్ ప్రక్రియలో చేసిన కామెంట్ దృష్టిలో పెట్టుకొని ఆ మాట అన్నాను. అదే విధంగా అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌కు పంపించేటప్పుడు అరియానాను ఉద్దేశించి నీవు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అని చెప్పానని లాస్య క్లారిటీ ఇచ్చారు.
Recommended Video

నామినేషన్స్, టాస్క్ మినహాయిస్తే...
ఇక నామినేషన్, టాస్క్ విషయాలు వదిలేస్తే.. ఇంటి వ్యవహారాల్లో అరియానా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అందరితో కలిసి ఉంటుంది. టాస్క్‌లో చాలా కషపడుతుంది. బిగ్‌బాస్ ఆదేశాలను కంపల్సరీగా పాటించాలని అనుకుంటుంది. గేమ్ రూల్స్ ప్రకారం ఆడేందుకు మానవత్వాన్ని కూడా పక్కన పెడుతుంది. అయితే గేమ్‌లో మాత్రం టాస్క్ తప్ప మారోటి ఆలోచించదు అని లాస్య తెలిపారు.


Click it and Unblock the Notifications











