మోనాల్ ఎవరో తెలియదు.. ఆమెతో పోలికా? ఎందుకు ఎలిమినేట్ చేయడం లేదంటే.. యాంకర్ లాస్య

బిగ్‌బాస్ తెలుగు 3లో యాంకర్ లాస్య ప్రయాణం గతవారం ముగిసిన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ ఇంటిలో 11 వారాలపాటు తనదైన ఆటతో ఆకట్టుకొన్న యాంకర్ లాస్య రియాలిటీ షోలో జరిగిన విషయాలను ఆసక్తికరంగా ఇటీవల పంచుకొన్నారు. 11వ వారంలో ఎలిమినేట్ అయిన తర్వాత పలు మీడియాలతో తన అనుభవాలను పంచుకొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ లాస్య ఇంటి సభ్యుల గురించి మాట్లాడుతూ..

ఇంటిలో కిచెన్ బాధ్యతలు

ఇంటిలో కిచెన్ బాధ్యతలు

బిగ్‌బాస్‌లో గంగవ్వ తర్వాత నేను పెద్దావిడను అనే ప్రచారం జరిగింది. కానీ నేను అంత పెద్దావిడను కాదు. ఆమెతో నన్ను పోల్చకూడదు. ఆమె అంత వయసు నాకు లేదు. కాకపోతే ఇంటిలో వంటల బాధ్యతలను నేను ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాంటి ఫీలింగ్ కలిగింది. దాంతో నేను వంటలక్కను అయిపోయాను. అది కాక అందరూ నన్ను లాస్య అక్క అంటూ పిలవడంతో అలాంటి ఫీలింగ్ కలిగింది అని యాంకర్ లాస్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టాస్కుల్లో చాలా కష్టపడ్డాను.. అయినా

టాస్కుల్లో చాలా కష్టపడ్డాను.. అయినా

ఇక ఇంటిలో నేను చాలానే కంటెంట్ ఇచ్చాను. పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్‌లో దీపం ఆరిపోకుండా చూసింది నేనే. ఉదయం ఏడు గంటల వరకు నిద్రపోకుండా ఉన్నాను. ఏడు గంటలకు పడుకొని ఎనిమిదిన్నర వరకు నిద్రపోయి ఆ తర్వాత సాయంత్రం వరకు దీపం ఆరిపోకుండా చూశాను. కానీ అలాంటి కంటెంట్‌ను చూపించకపోవడం వల్ల నేను ఏం చేశాననేది బయటకు ప్రొజెక్ట్ కాలేదు అని యాంకర్ లాస్య అన్నారు.

మోనాల్ గురించి అప్పటి వరకు తెలియదు

మోనాల్ గురించి అప్పటి వరకు తెలియదు

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 4లో ఎక్కువ సినిమాకు సంబంధంల లేని వారు ఉండటం వల్ల కంటెస్టెంట్ల కొత్తగా అనిపించారు. అయితే నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లే వరకు మోనాల్ ఎవరో తెలియదు. ఇంటిలోకి వెళ్లిన తర్వాత ఆమె హీరోయిన్ అనే విషయం నాకు తెలిసింది. అయితే కొందరు సినిమాకు సంబంధం లేకపోయినా వారి వారి రంగంలో వాళ్లు టాప్ అనే విషయాన్ని నేను గ్రహించాను అని యాంకర్ లాస్య అన్నారు.

అభిజిత్‌తో మోనాల్ ట్రాక్

అభిజిత్‌తో మోనాల్ ట్రాక్

బిగ్‌బాస్‌లో అభిజిత్‌తో మోనాల్‌కు ఎలాంటి రిలేషన్ లేదు. వారిద్దరు ముందుగా కొంత మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ పెద్దగా క్లోజ్ కాలేదు. అభిజిత్‌ కూడా కొన్ని విషయాల కారణంగా ఆమెకు దూరంగా ఉన్నాడు. అయితే వాళ్ల మధ్య ట్రాక్ పెద్దగా నడువలేదు అని యాంకర్ లాస్య పేర్కొన్నారు.

అఖిల్, మోనాల్ మధ్య క్లోజ్ రిలేషన్

అఖిల్, మోనాల్ మధ్య క్లోజ్ రిలేషన్

అఖిల్‌తో మోనాల్‌ మధ్య క్లోజ్ రిలేషన్ ఉంది. కానీ వారిద్దరి లవ్ అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వాళ్లు చెప్పిన ప్రకారం మోనాల్, అఖిల్ ప్రెండ్స్ మాత్రమే. కాకపోతే వాళ్లిద్దరి మధ్య క్లోజ్ ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉంది. మా మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని అఖిల్, మోనాల్ చెప్పారని యాంకర్ లాస్య చెప్పారు.

Recommended Video

Varsha Bollamma, Anand Devarakonda Interview Part 3 | Middle Class Melodies
మోనాల్‌ను ఎందుకు ఉంచుతున్నారో ...

మోనాల్‌ను ఎందుకు ఉంచుతున్నారో ...

మోనాల్ గజ్జర్‌ను కావాలని బిగ్‌బాస్‌లో స్టార్ మా ఉంచుతున్నారనే విషయంపై నాకు పెద్దగా ఏమీ తెలియదు. గ్లామర్ కోసం ఉంచుతున్నారా అంటే కూడా నేను పెద్దగా చెప్పలేను. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది అదే అంటున్నారు. ఆమె విషయంలో స్టార్ మా సానుకూలంగా ఉందా? ప్రేక్షకుల నుంచి మంచి రెస్సాన్స్ ఉందా అంటే నేను స్పష్టంగా చెప్పలేను అని యాంకర్ లాస్య అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X