లిప్‌లాక్ కావాలి అంటూ లాస్య: ఎన్నో ఏళ్లుగా దాని కోసమే వెయిటింగ్ అంటూ రవి..ఇద్దరి కెమిస్ట్రీ కేక
బుల్లితెర మీద యాంకర్ లాస్య, యాంకర్ రవి జోడికి ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పలేం. గతంలో ప్రముఖ చానెల్లో ప్రసారమైన వీరిద్దరి షోలకు టాప్ రేటింగ్ ఉండేది. బుల్లితెర మీద వారిద్దరి మధ్య చోటుచేసుకొనే కెమిస్ట్రీ ఏం రేంజ్‌లో ఉంటుందనే దానికి ఆ షోల టీఆర్పీలే చెప్పేవి. అయితే చాలా గ్యాప్ తర్వాత యాంకర్ రవి, లాస్య మళ్లీ జతకట్టడం అభిమానుల్లో జోష్ పెంచింది.. ఆ వివరాల్లోకి వెళితే...

క్రేజీ జంటగా లాస్య, రవి
గత నాలుగైదు ఏళ్ల క్రితం తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ లాస్య, రవి జంట వారి ప్రతిభతో తడాఖా చూపించారు. ఆ జంట యాంకర్లుగా వ్యవహరించిన పలు షోలు టాప్ టీఆర్పీని సాధించాయి. దీంతో ఆ జంటకు మంచి క్రేజ్ ఏర్పడంది. ఓ దశలో వారిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమనే రూమర్లు వినిపించాయి.

లాస్య, రవిపై రూమర్లు
అయితే యాంకర్ లాస్యకు రవికి అభిప్రాయభేదాలు వచ్చాయి. వారిద్దరూ విడిపోయారు అనే వార్తలు జోరందుకున్నాయి. కానీ ఆ వార్తలకు తెర దించుతూ.. లాస్య ప్రేమ వివాహం చేసుకోవడంతో అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత లాస్య చాలా కాలం టెలివిజన్ రంగానికి దూరంగానే ఉన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 4తో మళ్లీ
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్‌లో యాంకర్ లాస్య మరోసారి మెరిసింది. ఈ షోలో లాస్య చూపించిన టాలెంట్‌తో మరింతగా ప్రేక్షకులను సంపాదించుకొన్నారు. ఆ తర్వాత మళ్లీ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడమే కాకుండా పలు షోలతో బిజీగా మారారు. కామెడీ స్టార్స్ కార్యక్రమంతో లాస్య, యాంకర్ రవి మళ్లీ జతకట్టారు. ప్రస్తుతం ఈ షో టీజర్ క్రేజీగా వైరల్‌గా మారింది.

జగదేకవీరుడు అతిలోకసుందరి స్పూఫ్
కామెడీ స్టార్స్ షోలో భాగంగా తాజా ఎపిసోడ్‌లో జగదేక వీరుడు అతిలోక సుందరి స్పూఫ్‌ను ప్రదర్శించారు. జగదేకవీరుడిగా రవి, అతిలోక సుందరిగా లాస్య నటించారు. అందాలలో అనే పాటపై లాస్య ఎంట్రీ ఇచ్చింది. జడ్జిగా కనిపించిన శేఖర్ మాస్టర్‌ను చూసి అచ్చం జనకుడిగా ఉన్నారు అంటే.. ఆయన అందరికి జనకుడే అంటూ పక్కనే ఉన్న హోస్ట్ పంచ్ విసిరింది.
Recommended Video

లిప్‌లాక్ కావాలి అంటూ లాస్య
ఇక జగదేకవీరుడి పాత్రలో ఉన్న రవి ఫోన్‌లో రొమాంటిక్ సీన్ చూస్తుంటే.. వాళ్లు మూతులు మూతులు తాకుతున్నారేందుకు అని లాస్య అంటే.. వాళ్లు ముద్దు పెట్టుకొంటున్నారు అని యాంకర్ రవి సమాధానం ఇచ్చారు. దాంతో నాకు కూడా కావాలి అంటూ లాస్య అడిగింది. దాంతో ఎగిరి గంతేసిన రవి.. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసేది ఇందుకోసమే అని తన మనసులోని కోరిక బయటపెట్టారు. రవి మాట వినగానే.. పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్.. ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చాడు అంటూ పంచ్ విసిరారు.


Click it and Unblock the Notifications











