twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందరి ముందే క్షమించమని అడిగేశాడు.. ఒక్కటైన లాస్య రవి.. వాళ్లకు ధీటుగా భారీ ప్లాన్!!

    |

    బుల్లితెరపై పండుగ వాతావరణం ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లతో చానెల్‌లు సందడి వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలా ఈ సంక్రాంతికి ఈటీవీలో అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్ రాబోతోంది. ఇక స్టార్ మాలో ఇట్సే ఫ్యామిలీ పార్టీ అనే స్పెషల్ ఈవెంట్ రాబోతోంది. ఇప్పటికే అత్తో అత్తమ్మ కూతురో ఈవెంట్ ప్రోమోలో యూట్యూబ్‌ను షేక్ చేసేస్తున్నాయి.

    వారే హైలెట్...

    వారే హైలెట్...

    జబర్దస్త్ టీంతో కలిసి అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌లో ఆది, అనసూయ, వర్ష, ఇమాన్యుయేల, ప్రదీప్, రోజా వంటి వారున్నారు. ఇందులో ఎంత మంది ఉన్నా కూడా వర్ష ఇమాన్యుయేల్ మీదే అందరి ఫోకస్ ఉండేలా కనిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు ఆ ఇద్దరూ హైలెట్ అయ్యేలా ఉన్నారు.

    అక్కడ వారు..

    అక్కడ వారు..

    అయితే స్టార్ మాలో రాబోతోన్న ఇట్సే ఫ్యామిలీ పార్టీ ఈవెంట్‌లో మాత్రం లాస్య రవి హైలెట్ అయ్యేలా ఉన్నారు. దాదాపు ఐదేళ్ల తరువాత ఈ ఇద్దరూ ఒకే స్టేజ్ మీద కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్, జరిగిన గొడవలు, పెరిగిన దూరం అందరికీ తెలిసిందే.

    గొడవలతో దూరం..

    రవి లాస్య అంటే ఒకప్పుడు ఎంతో క్రేజ్ ఉండేది. ఈ ఇద్దరూ విడిపోయాక రవి అలానే ఉన్నాడు.. లాస్య స్థానంలో శ్రీముఖి, వర్షిణి, భాను శ్రీ ఇలా ఎంతో మంది వచ్చారు వెళ్లారు. కానీ లాస్య రవి చేసిన మ్యాజిక్‌ను మాత్రం ఎవ్వరూ రిపీట్ చేయలేకపోయారు.

    అందుకే అలా..

    అందుకే అలా..

    రవి లాస్యలను ఒక స్టేజ్ మీదకు తీసుకురావాలి, కలపాలి అనే పాయింట్ ఒక్కటే ఈవెంట్ మొత్తాన్ని నడిపించేలా ఉంది. ఐదేళ్ల తరువాత రవి లాస్య చేయబోతోన్న ఈవెంట్ అంటూ ముందుగానే హింట్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఈ ఇద్దరూ తమ మధ్యఉన్న మనస్పర్థలను మరిచిపోయినట్టు చూపించారు.

    క్షమించు..

    క్షమించు..

    ఇంతకు ముందు ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే క్షమించు అని అందరి ముందే లాస్యను రవి అడిగేశాడు. మొత్తానికి ఈ ఇద్దిరిని ఇలా చూడటంతో అందరి చూపు ఈ ఈవెంట్‌పైనే పడింది. పైగా ఇందులో అభిజిత్, అభిజిత్ తల్లి ఇలా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉండబోతోన్నట్టున్నాయి.

    English summary
    Anchor Lasya And Ravi In Sankranthi Event It's A Family Party.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X