మా నాన్నని మోసం చేశా.. కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ లాస్య
పండుగలు వస్తున్నాయంటే చాలు బుల్లితెర ముందే అలెర్ట్ అయి స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంటారు. అలా స్టార్ మా, ఈ టీవీ, జీ తెలుగు చానెళ్లు సెలెబ్రిటీలను వెతికి పట్టుకొచ్చి ఎంటర్టైన్ చేస్తుంటారు. అలా ఈ సారి ఆంగ్ల నూతన సంవత్సరాదికి ఈ టీవీ లో జరిగిన స్పెషల్ ప్రోగ్రాం లో లాస్య కన్నీరు పెట్టుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

చాన్నాళ్లకు
బుల్లితెరపై యాంకర్ రవి లాస్య కపుల్ ఒక సంచలనం. ఈ ఇద్దరూ కలిసి చేసిన షో ఎలాటింది అయినా సూపర్ హిట్ అవ్వలసిందే. ఈ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు హాట్ టాపిక్ అయ్యారు.. ఇద్దరూ విడిపోయి ఎవరి షోలు వారు చేసుకున్న సమయంలోనూ హాట్ టాపిక్ కూడా అయ్యారు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు విడిపోయారంటూ నిత్యం ఏదో రకమైన రూమర్ బయటకు వచ్చేది. మళ్లీ చాన్నాళ్లకు ఈ ఇద్దరూ కలిసి షోలు చేశారు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయి
అయితే న్యూ ఇయర్ సందర్భంగా మల్లెమాల సంస్థ చేసిన 'పెళ్ళాం వద్దు... పార్టీ ముద్దు' అనే స్పెషల్ ప్రోగ్రామ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోగ్రామ్‌లో రష్మీ గౌతమ్ ఓ డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు. అందులో ప్రేమకు తండ్రి నుంచి అంగీకారం లభించలేదని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అమ్మాయిగా రష్మీ గౌతమ్ కనిపించారు.

ఇంట్లో నుంచి వెళ్లిపోవడం
అంతే కాక 'నాన్నా! నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే... తనను పెళ్లి చేసుకుంటా' అని రష్మీ అంటే, 'నా గురించి నీకు తెలియదు. పరువు కోసం నేను ప్రాణం ఇవ్వడానికి అయినా... తీయడానికి అయినా సిద్ధం' అంటూ నాన్న పాత్ర పోషిస్తున్న 'రాకెట్' రాఘవ 'అనడం, ఆ తరువాత మీరు అర్థం చేసుకుంటారని నేను చాలా ట్రై చేశాను. ఐ యామ్ సారీ నాన్న!' అని చెబుతూ రష్మీ గౌతమ్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం చూపించారు.

లాస్య కన్నీళ్లు
ఇక అది చూసి మరో యాంకర్ లాస్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను అదే విధంగా చేశానని చెప్పుకొచ్చారు. పెళ్లి సమయంలో చేసిన పనికి ఇప్పుడు తాను బాధపడుతున్నట్టు ఆమె చెబుతూ కన్నీటి పర్యంతం అయింది. "నేను అలాగే చేసి వచ్చాను మా నాన్నకు! మా నాన్న గుర్తుకు వచ్చారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్న లాస్య... రష్మీ గౌతమ్ ను పెర్ఫార్మెన్స్ అవగానే వెళ్లి హగ్ చేసుకున్నారు.
Recommended Video

కళ్లు మూసుకుపోయి
ప్రేమలో ఉన్నప్పుడు మనం ప్రేమించే వాళ్ళనే కాక మనని ప్రేమించే వాళ్లను మనం ఎంత బాధ పెడుతున్నాం అనేది తెలుసుకోం. ఎందుకంటే... అప్పుడు కళ్లు మూసుకుపోయి ఉంటాయి కదా, అప్పుడు ప్రేమలో ఉంటాం కదా! నేను అలాగే చేశాను, ఇప్పుడు రష్మీ పెర్ఫార్మన్స్ చూస్తే మా నాన్న గుర్తుకు వచ్చారు" అంటూ ఆమె కన్నీళ్లతో వివరించారు. ఆమెను భర్త మంజునాథ్, రష్మీ గౌతమ్ ఓదార్చారు. రాయలసీమకు చెందిన లాస్య సినీ పరిశ్రమలో సత్తా చాటుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. దానికంటే ముందు ఆమెకి బుల్లితెరలో అవకాశాలు లభించాయి.


Click it and Unblock the Notifications











