ఎందుకు అరుస్తున్నావు.. లాస్యతో నోయల్ బిగ్‌ఫైట్.. ఇంట్లో రచ్చ రచ్చ

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో సీజన్‌ 4 నాలుగో వారానికి చేరుకొన్నది. రోజులు గడుస్తున్న కొద్ది ఇంటి సభ్యుల్లో పట్టు సాధించాలనే ప్రయత్నం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు సౌమ్యంగా కనిపించిన వాళ్లంతా తమ గేమ్ ప్లాన్‌తో దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సోమవారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల మధ్య భారీగానే రచ్చ జరిగినట్టు స్పష్టమవుతున్నది. నాలుగో ఎలిమినేషన్‌కు నామినేషన్ ప్రక్రియ ఇంట్లో బాగానే చిచ్చు పెట్టిందా అనే అనుమానం కలుగుతున్నది. తాజాగా రిలీజైన వీడియోలో నోయల్, లాస్య మధ్య గొడవ చూస్తే..

ఇప్పటికే ముగ్గురు సెలబ్రిటీల అవుట్

ఇప్పటికే ముగ్గురు సెలబ్రిటీల అవుట్

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో ఇప్పటికే ముగ్గురు సెలబ్రిటీలు ఎలిమినేషన్ అయ్యారు. తొలివారం సూర్య కిరణ్, రెండోవారం కరాటే కళ్యాణి, మూడో వారం దేవీ నాగవళ్లి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు నాలుగో సెలబ్రిటీ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. బిగ్‌బాస్ తెలుగు 4లో గేమ్ మరింత క్లిష్టంగా మారిన క్రమంలో సెలబ్రిటీలు తమను తాము రక్షించుకొనేందుకు సిద్దమవుతున్నారు.

లాస్య రెచ్చిపోయి.. నోయల్‌కు వార్నింగ్

లాస్య రెచ్చిపోయి.. నోయల్‌కు వార్నింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో మూడు వారాలుగా యాంకర్ లాస్య చాలా కామ్‌గా, అందరితో మంచిగా ఉండాలన్న దృష్టితో గేమ్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో దేవీ నాగవళ్లి ఎలిమినేట్ అవుతూ చెప్పిన విషయాలతో ఈ రోజు ఎపిసోడ్‌ చూస్తే ఆమె రియలైజ్ అయినట్టు కనిపించింది. నోయల్‌కు గట్టిగా వార్నింగ్ ఇస్తూ కనిపించింది.

నోయల్, లాస్య మధ్య గొడవ

నోయల్, లాస్య మధ్య గొడవ

నోయల్, లాస్య మధ్య సంభాషణ ఇలా సాగుతూ.. ఎవరు చెప్పారో ముందు అడిగి చూడు అని లాస్య అంటే.. ఎందుకు అరుస్తున్నావు. నాకు అరవడం రాదనుకొంటున్నావా అంటూ నోయల్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో నాకు అరవడం వచ్చు. నీకే కాదు నాకు కూడా వచ్చు అంటూ లాస్య గట్టిగా సమాధానం చెప్పింది.

నాకు వెనుక మాట్లాడే అలవాటు

నాకు వెనుక మాట్లాడే అలవాటు

నోయల్‌తో అదే గొడవను కొనసాగిస్తూ నీ వెనుక మాట్లాడే అవసరం నాకు లేదు అని లాస్య అంటే.. నా ముందు మాట్లాడు పిలుస్తా అంటూ నోయల్ గట్టిగా అరిచాడు. ముందుకు తీసుకురా.. నాకు వెనుక మాట్లాడటం అలవాటు లేదు అంటూ లాస్య గట్టిగా అరిచింది. ఇలా వారిద్దరూ అరుచుకోవడంతో ఇంటి సభ్యులు ఫేస్‌లో ఏదో తెలియని కంగారు, ఆందోళన కనిపించింది. తాజా టీజర్‌ ప్రేక్షకుల్లో ఓ ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X