Anchor Lasya: మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య.. వీడియో వైరల్
తనదైన శైలీలో బుల్లితెరపై యాంకర్‌గా రాణించింది లాస్య. తన యాంకరింగ్‌తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఒకప్పుడు యాంకర్‌గా అదరగొట్టిన లాస్య ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్‌తో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్‌కు దూరంగా ఉన్న లాస్య బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటరై మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. పలు వీడియోస్‌తో సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేసే లాస్య తాజాగా గుడ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండోసారి గల్బం దాల్చిన లాస్య వీడియో షేర్ చేస్తూ అభిమానులకు, బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త అందించింది.

యాంకరింగ్ లో..
ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో అదరగొట్టింది. తనదైన స్టైల్ లో చలాకీగా మాట్లాడుతూ వాగుడు కాయిగా పేరు తెచ్చుకుంది. ఇక యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్‌లో వీరిద్దరి జోడి మోస్ట్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. యాంకరింగ్ లో ఎవరు తెచ్చుకోనంత గుర్తింపును యాంకర్ లాస్య-రవి జోడీ సంపాదించుకుది.

ప్రేక్షకుల గుండెల్లో..
బుల్లితెరపై స్టార్ యాంకర్స్ గా కొనసాగిన, కొనసాగుతున్న అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్లతో సహా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది యాంకర్ లాస్య. ముఖ్యంగా తన అమాయకత్వంతో చీమ ఏనుగు జోక్స్ చెప్పి సమ్‌థింగ్ స్పెషల్ అంటూ క్యూట్‌గా అందరిని నవ్వించేది. చురుకైన యాటిట్యూడ్‌తో, చలాకీ మాటలతో బుల్లితెరపై ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

అతనితో మనస్పర్థలు..
యాంకరింగ్ తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో ఆ కెరీర్ కు దూరమైంది లాస్య. ఆమె యాంకరింగ్ మానేయడానికి అనేక రూమర్స్ వినిపించాయి. వాటన్నింటిని యాంకర్ లాస్య సైతం ఖండించింది. తను యాంకరింగ్ మానేయడానికి గల కారణాలను పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది లాస్య. అయితే యాంకర్ లాస్యకు, రవికి మనస్పర్థలు వచ్చినట్లు, అందుకే టీవీ షోలు మానేసినట్లు వార్తలు వినిపించాయి. యాంకరింగ్ తర్వాత లాస్య బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్ తో బుల్లితెరపై మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

బిగ్ బాస్ హౌజ్ లో షాకింగ్ గా..
బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో ముందుగా అందరి దృష్టిని ఆకర్షించిన లాస్య తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. హౌజ్ లో వంటగదికే పరిమితం అయిన లాస్య అంతగా రాణించలేకపోయింది. అలాగే కొన్నిసార్లు కొంతమేర నెగెటివిటీని కూడా మూటగట్టుకుంది. ఈ సీజన్ లోనే తన ప్రేమ, పెళ్లికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు బయటపెట్టి షాక్ ఇచ్చింది. కానీ బిగ్ బాస్ హౌజ్ ను తొందర్లోనే విడిచి పెట్టిపోయింది.

ఘనంగా సీమంతం వేడుకలు..
బిగ్ బాస్ షో తర్వాత లాస్య టాక్స్ అని యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి రకరకాల వీడియోలతో అలరిస్తూ వచ్చింది యాంకర్ లాస్య. అయితే ఇటీవల తాను రెండోసారి గర్భం దాల్చినట్లు తెలిపింది. మరో రెండు చిట్టి పాదాలతో తన కుటుంబం మరింత పెద్దది కానుంది అంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత లాస్య సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఫంక్షన్ కు బిగ్ బాస్ గీతూ రాయల్ తోపాటు నటీమణులు శ్రీవాణి, సుష్మ, అలేఖ్య హారిక హాజరై సందడి చేశారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.
హోళి సందర్భంగా గుడ్ న్యూస్..
ఇప్పుడు తాజాగా ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపి గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. అయితే మంగళవారమే బిడ్డను ప్రసవించిన లాస్య.. బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హోలీ పండుగ నేపథ్యంలో రుంగుల ద్వారా తనకు మగ బిడ్డ పుట్టినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఓ వీడియోను షేర్ చేసి సంతోషం పంచుకుంది. దీంతో అభిమానులు లాస్య, మంజునాథ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిడ్డను, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. కాగా లాస్యకు మొదటిసారి కూడా కొడుకే పుట్టాడు. ఆ బాబును జున్ను అని ప్రేమగా పిలుచుకుంటుంది.


Click it and Unblock the Notifications











