చపాతీ డ్యాన్స్‌తో దుమ్మురేపిన లాస్య.. ముద్దులన్నీ నాకే ఇస్తే నీ బాయ్‌ఫ్రెండ్ ఎలా.. హారికతో అవినాష్
బిగ్‌బాస్ ఇంటిలో 27వ రోజు హ్యాపీ మూడ్‌తో సాగిపోయింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఫుల్లుగా వినోదంతో ముగిసింది. ఇంటిలో మార్నింగ్ మస్తీలో డ్యాన్స్ ప్రాక్టీసులు, చందనా బ్రదర్స్ ప్యాషన్ షో, అవినాష్‌తో అద్దం ముందు గేమ్స్ ఫన్‌ను జనరేట్ చేశాయి. ఇంటి సభ్యులందరూ సంతోషంగా కనిపించారు. 26 ఇంటిలో జరిగిన విషయాలు వివరంగా..

మార్నింగ్ మస్తీలో డ్యాన్స్ ప్రాక్టీస్
ప్రతీ రోజు జరిగే మార్నింగ్ మస్తీలో భాగంగా ఫన్ గేమ్ కొనసాగింది. మెహబూబ్ అందరికి డ్యాన్స్ చేయించే టాస్క్‌ను మొదలుపెట్టారు. లాస్యకు చపాతి డ్యాన్స్ నేర్పించగా, గాయపడిన అవినాష్‌తో ఓ గమ్మత్తైన స్టెప్పులను ప్రాక్టీస్ చేయించాడు. అరియానాకు రెట్రో డ్యాన్స్‌తో స్టెప్పులు వేయించాడు. అమ్మ రాజశేఖర్‌తో కాంచన, చంద్రముఖి పాటలకు మాస్ స్టెప్పులు వేయించాడు. గంగవ్వతో మాస్ స్టెప్పులతో అలరించాడు.

ప్రకాశ్ రాజ్ మాదిరిగా అవినాష్ కామెడీ
ఇక అవినాష్ వంటగది వద్ద ప్రకాశ్ రాజ్ గొంతును అనుకరిస్తూ ఇంటి సభ్యులందరిపై కామెంట్ చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. లాస్యపై సెటైర్లు వేశాడు. లాస్య చెప్పే చీమ జోక్ ఎవరికీ అర్థం కాదు. ఆమె ఒక్కరికే అర్ధం అవుతుంది అని అవినాష్ కామెడీ చేశాడు.

కన్ఫెషన్ రూమ్‌లో అఖిల్ సార్థక్
అఖిల్ సార్థక్‌ను ఇంటిలోని కన్ఫెషన్ రూమ్‌లోకి బిగ్‌బాస్ పిలిచి లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం ఇంటి సభ్యులకు వస్తువులను కొనుగోలు చేయమన్నారు. 3200 పాయింట్లతో 16 మంది సభ్యులకు కొనుగోలు చేయాలి. ఆ వస్తువులు వారు మాత్రమే వినియోగించాలని బిగ్‌బాస్ సూచింంచారు. అలా అఖిల్ తనకిచ్చిన టాస్క్‌ను పూర్తి చేశాడు.

చందనా బ్రదర్స్ ఫ్యాషన్ షో
ఇంటి సభ్యులకు ఫ్యాషన్ డిజైన్ దుస్తులను పంపించారు. అందర్నీ అందంగా ముస్తాబై ఇంటిలోని ర్యాంప్‌పై ఫ్యాషన్ వాక్ చేయమని చెప్పారు. అలా పురుషులు ఓ జట్టుగా, మహిళలకు ఓ జట్టుగా ఫ్యాషన్ వాక్ చేశారు. మహిళల్లో గంగవ్వ బహుమతి సాధించగా, పురుషుల్లో అవినాష్ ప్రైజ్‌ను గెలుచుకొన్నారు. వారికి చందన బ్రదర్స్ వారి తరఫున 1 లక్ష రూపాయల గిఫ్ట్ హ్యాంపర్ లభించింది.
Recommended Video

బహుమతి సాధించిన అవినాష్‌ను
ఆ తర్వాత పురుషుల్లో బహుమతి సాధించిన అవినాష్‌ను మహిళా కంటెస్టెంట్ల కోసం అద్దంగా మారి.. వారిపై మాటలతో హాస్యంతో పుట్టేలా కామెంట్ చేయాలి. అరియానాను, హారికను ఆటపట్టించాడు. లాస్యను కూడా సెటైర్లు భారీగానే వేశాడు. ముద్దులు పెడుతున్న హారికను ఉద్దేశించి అన్నీ నాకే పెడితే నీ బాయ్‌ఫ్రెండ్‌కు ఏం పెడుతావు అంటూ కామెంట్ వేశారు. లాస్యను ఉద్దేశించి నీ భర్త ఎలా పడ్డారో.. అందుకే బాధపడి ఉంటారనే విధంగా కామెంట్ చేశారు. ఈ గేమ్ చాలా ఫన్‌గా సాగింది.


Click it and Unblock the Notifications











