Don't Miss!
- News ఏకగ్రీవంగా సికింద్రాబాద్.. మోడీ-అమిత్ షా గేమ్ ప్లాన్?
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘బిగ్ బాస్ 3’ ద్వారా యాంకర్ లాస్య రీ ఎంట్రీ... ఇన్నాళ్లు అందుకే దూరం!
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో మొదటి రెండు సీజన్లు విజయవంతంగా రన్ అవ్వడంతో నిర్వాహకులు త్వరలో మూడో సీజన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై మూడో వారంలో ఈ షో మొదలయ్యే అవకాశం ఉంది. మాటీవీ వారు 'బిగ్ బాస్ తెలుగు 3'కి సంబంధించిన అఫీషియల్ ప్రోమో ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎవరి పేరు అఫీషియల్‌గా బయటకు రాలేదు. అక్కినేని నాగార్జున ఈసారి హోస్టుగా దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం ఆయనపై ఈ షోకు సంబంధించిన ప్రోమో చిత్రీకరణ జరుతోందని, త్వరలో ఇది రిలీజ్ చేయడంతో పాటు ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉందని టాక్.
యాంకర్ లాస్య ఖరారు?
తాజా సమాచారం ప్రకారం ఈ షోలో యాంకర్ లాస్య ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆెమె టీవీ రంగానికి, యాంకరింగ్‌కు దూరంగా ఉంటున్నారు. ‘బిగ్ బాస్ 3' ద్వారా మళ్లీ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
లాస్యకు ఫాలోయింగ్ ఎక్కువే
యాంకర్ రవితో కలిసి పలు షోలు హోస్ట్ చేసిన లాస్యకు ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లాడిన అనంతరం ఆమె టీవీ రంగానికి దూరం అయ్యారు. ఇపుడు బిగ్ బాస్ షో ద్వారా వస్తే రీ ఎంట్రీ బావుంటుందనే ఉద్దేశ్యంతో ఈ వివాదాస్పద షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
యాంకర్ రవితో వివాదం
అప్పట్లో యాంకర్ రవితో ఓ వివాదం కారణంగా లాస్య వార్తల్లో వ్యక్తిగా మారారు. నటుడు చలపతి రావు గొడవకు సంబంధించి విజే శశి... యాంకర్ రవి మీద ఫైర్ అయిన సందర్భంలో లాస్య కూడా శశికి సపోర్టుగా నిలవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ షోలోకి ఎంటరైతే లాస్య...ఏదో ఒక సందర్భంలో యాంకర్ రవి గురించి ప్రస్తావించే అవకాశం ఉంది.
శ్రీముఖి వర్సెస్ లాస్య?
యాంకర్ రవితో కలిసి పటాస్ షోకు యాంకరింగ్ చేసిన శ్రీముఖి కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఎంటరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు లాస్య, అటు శ్రీముఖి కలిస్తే బిగ్ బాస్ హౌస్‌లో ఎలాంటి పరిణామాలు, గొడవలు చోటు చేసుకుంటాయో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.