ఏడేళ్లు పెళ్లి విషయాన్ని దాచిన లాస్య.. భర్తతో అలాంటి బంధమని అబద్దం.. బిగ్‌బాస్‌లో ఎమోషనల్

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో 39వ రోజు భావోద్వేగాలతో సాగింది. ఇంటి సభ్యుల టాస్క్‌లతోపాటు తమ వ్యక్తిగత జీవితాల గురించి వెల్లడిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇంటి సభ్యులందరూ ఎంజాయ్ చేస్తూ రోజును గడిపారు. తమ చిన్ననాటి గుర్తులను, బాల్యాన్ని గుర్తు చేసుకొని కంటతడి పెట్టారు. 39వ రోజు ఇంకా ఏం జరిగిందంటే..

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో

ఇంటి సభ్యులకు లగ్జరీ టాస్క్‌‌ను బిగ్‌బాస్ ఇచ్చాడు. స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి అందులో మజా బాటిల్స్‌ను తీసుకొని పైకి వచ్చి మజాను తాగాలి. అలా ఎన్ని బాటిల్స్ ఎక్కువగా తాగితే వారు విజేతలు అవుతారు. ముఖ్యంగా బాటిల్‌పై ఉన్న స్లిప్స్‌ ఆధారంగా వస్తువులు వారికి లభిస్తాయని చెప్పారు. ఈ టాస్క్‌లో కుమార్ సాయి, మెహబూబ్ పాల్గొన్నారు. మెహబూబ్ ఈ పోటీల విజయం సాధించారు.

అరియానాకు స్పూన్‌తో సోహైల్ తినిపిస్తూ

అరియానాకు స్పూన్‌తో సోహైల్ తినిపిస్తూ

ఇక గతవారం అరియానాకు, సోహైల్ గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే అరియానాతో విభేదాలను పరిష్కరించుకోవడానికి సోహైల్ ప్రయత్నించడం కనిపించింది. ఆ క్రమంలోనే అరియానాను పిలిచి తన పక్కన పెట్టుకొని సారీ చెప్పారు. ఆ తర్వాత సోహైల్ స్వయంగా అరియానాకు నూడుల్స్ తినిపించారు.

చిన్ననాటి అనుభూతులతో భావోద్వేగం

చిన్ననాటి అనుభూతులతో భావోద్వేగం

ఇక ఇంటిలోని సభ్యులకు వారి చిన్ననాటి ఫోటోలను చూపించి థ్రిల్ చేశారు. అలా ఫోటోలు చూపిస్తున్నంత సేపు ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. కొందరు కంటతడి పెట్టుకొంటూ కనిపించారు. తమ చిన్ననాటి అనుభూతులను ఇంటి సభ్యులతో పంచుకొన్నారు.

భోరున విలపించిన అరియానా, హారిక, లాస్య

భోరున విలపించిన అరియానా, హారిక, లాస్య

చిన్ననాటి ఫోటోలను ఇంటి సభ్యులకు గిఫ్టులుగా బిగ్‌బాస్ ఇవ్వడంతో వాటిని చూసి ఎమోషనల్ అయ్యారు. తన కుటుంబంలోని సుఖ: సంతోషాలు, బాధలను పంచుకొంటూ కొందరు భోరున విలపించారు. అరియానా, హారిక, లాస్య చెప్పిన విషయాలు చాలా ఎమోషనల్‌గా అనిపించాయి.

Recommended Video

Case 99 Movie Motion Poster Launch By Director Boyapati Srinu
భర్త గురించి సీక్రెట్ బయటపెట్టిన లాస్య

భర్త గురించి సీక్రెట్ బయటపెట్టిన లాస్య

ఇలా తమ జీవితాలోని కీలక ఘట్టాలను పంచుకొన్న తర్వాత లాస్య ప్రధానంగా భావోద్వేగానికి గురయ్యారు. నా భర్త బుజ్జితో పెళ్లైన ఏడు సంవత్సరాల వరకు ఆయన భర్త అని చెప్పలేదు. నాతో షూటింగ్‌కు వస్తే నా కజిన్ అని చెప్పాను. నా భర్త అనే ట్యాగ్‌ను దాచిపెట్టాను. అందుక సారీ బుజ్జి. మీరు లేకుండా ఉంటానని చెప్పాను. కానీ ప్రతీ రోజు మీ గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని అని లాస్య చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X