నా బిడ్డలను నా చేతులతోనే చంపేసుకొన్నా.. నన్ను క్షమించండి.. షాకింగ్ లాస్య వెల్లడి

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 60వ రోజున ఇంటి సభ్యులకు తమ జీవితాల్లో జరిగిన విషయాలను, మరోకరి జీవితాలపై తమ ప్రభావం అనే అంశంపై వెల్లడించాలని సూచించారు. బీ ఏ లైట్ ఇన్ అదర్స్ లైఫ్ అనే టాస్క్‌లో భాగంగా లాస్య మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పుతూ కంటతడి పెట్టారు. తన జీవితంలో జరిగిన సంఘటనను చెబుతూ ఇంటి సభ్యులందరినీ భావోద్వేగానికి గురిచేశారు. లాస్య చెప్పిన విషయాలు ఏమిటంటే..

మా పెళ్లిని సీక్రెట్‌గా పెట్టాం..

మా పెళ్లిని సీక్రెట్‌గా పెట్టాం..


నా పెళ్లి గురించి ఎవరికీ తెలియదు. వాస్తవానికి 2010లో నేను వివాహం చేసుకొన్నాను. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఈ షోకు వచ్చిన తర్వాతే నేను నా పెళ్లి గురించి వాస్తవాలు చెప్పాను. 2010లో పెళ్లి జరిగినప్పటికీ 2012 వరకు ఎవరికి వారే ఉన్నాం. 2012 వరకు ఇరు కుటుంబాలను ఒప్పించడానికి ప్రయత్నించాం. కానీ మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు. మా పెళ్లిని అంగీకరించలేదు. ఆ తర్వాత 2012 నుంచి కలిసి ఉండటం ప్రారంభించాం అని తన వివాహం గురించి లాస్య చెప్పారు.

తొలిసారి అప్పుడే ప్రెగ్నెంట్

తొలిసారి అప్పుడే ప్రెగ్నెంట్

అలా దాంపత్య జీవితం ప్రారంభించిన తర్వాత 2014లో మా నాన్న నుంచి నాకు ఓ ఫోన్ వచ్చింది. దాంతో హ్యాపీగా ఫీలయ్యాను. మన కుటుంబంలో నీ పెళ్లి గురించి తెలియదు. అలానే ఆ విషయాన్ని ఉంచండి. మీరు జీవితంలో స్థిరపడేందుకు ప్రయత్నించండి. మీ కాళ్ల మీద మీరు నిలబడిన తర్వాత నేనే పెళ్లి చేస్తానని మా నాన్న చెప్పాడు. ఆ ఆనందంలో ఉన్నప్పుడే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. 2014లో నేను తొలిసారి ప్రెగ్నెంట్ అయ్యాను.

అబార్షన్‌తో నా బిడ్డను తీయించుకొన్నా

అబార్షన్‌తో నా బిడ్డను తీయించుకొన్నా

అయితే నేను గర్బవతిని అనే విషయాన్ని తెలిసిన తర్వాత చాలా ఆలోచించాం. మా కుటుంబ సభ్యులకు తెలియవద్దనే విషయంతో అబార్షన్ చేయించుకొన్నాను. ఆ తర్వాత 2014లోనే కుటుంబ సభ్యులను ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకొన్నాం. పెళ్లైన 5 నెలల తర్వాత మళ్లీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ మూడు నెలల తర్వాత గర్భస్రావం జరిగింది. 2014లో తొలిసారి హాస్పిటల్ వెళ్లి చెక్ చేయించుకొన్న తర్వాత వచ్చిన రిపోర్టులు చూసిన ప్రతీసారి నాకు ఏడుపు వస్తుంది అని యాంకర్ లాస్య ఎమోషనల్ అయ్యారు.

అలా డిప్రెషన్‌కు గురయ్యాను

అలా డిప్రెషన్‌కు గురయ్యాను

ఇప్పటికీ నా ఫస్ట్ బేబికి సంబంధించిన రిపోర్టులు నా వద్ద ఇంకా ఉన్నాయి. నా ఫస్ట్ బేబిని మిస్ అయ్యాననే బాధ ఇప్పటికి కలుగుతుంది. నా బిడ్డను నా చేతులతోనే చంపేసుకొన్నాననే బాధ కలిగింది. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ కాననే విషయంతో డిప్రెషన్‌కు లోనయ్యాను. దాని తర్వాత 2018 ఆగస్టు 18న మళ్లీ నా కడుపులోకి జున్ను వచ్చాడు. జున్ను వచ్చిన తర్వాత నా లైఫ్ కంప్లీట్‌గా ఛేంజ్ అయిపోయింది. రెండుసార్లు బేబీని పొగొట్టుకొన్న బాధను గుర్తు చేసుకొని జున్ను ఎలా చూసుకొన్నానో నాకే తెలియదు అంటూ లాస్య పేర్కొన్నారు.

తప్పును క్షమించండి అంటూ లాస్య

తప్పును క్షమించండి అంటూ లాస్య

నా జీవితంలోకి జున్ను వచ్చిన తర్వాత వెలుగులు నిండాయి. నేను అబార్షన్ చేయించుకొన్న విషయం మీకు తెలియదు కాబట్టి.. మీకు ఇప్పుడు చెబుతున్నాను. ఆ తప్పు చేసినందుకు క్షమించండి అంటూ బిగ్‌బాస్ వేదిక నుంచి లాస్య వేడుకొన్నారు. ఈ టాస్క్‌లో అద్భుతంగా తన జీవితాన్ని గురించి చెప్పి ఆకట్టుకొన్న లాస్యకు మొబైల్ ఫోన్ బహుమతిగా లభించింది. దాంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X