Anchor Lasya: మొన్న హాస్పిటల్ బెడ్ పై .. నేడు గుడ్ న్యూస్ తో యాంకర్ లాస్య.. ఫొటోలు వైరల్
తనదైన శైలీలో బుల్లితెరపై యాంకర్‌గా రాణించింది లాస్య. తన యాంకరింగ్‌తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఒకప్పుడు యాంకర్‌గా అదరగొట్టిన లాస్య ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్‌తో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్‌కు దూరంగా ఉన్న లాస్య బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటరై మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. పలు వీడియోస్‌తో సోషల్ మీడియాలో అట్రాక్ట్ చేసే లాస్య మొన్నటి వరకు ఆరోగ్యం బాగోలేక ఆస్పత్రి బెడ్ పై ఉండటం చూశాం. అయితే తాజాగా యాంకర్ లాస్య గుడ్ న్యూస్ చెప్పింది.

మంచి రెస్పాన్స్..
ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో అదరగొట్టింది. యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్‌లో వీరిద్దరి జోడి మోస్ట్ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

చురుకైన యాటిట్యూడ్ తో..
అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్లతో సహా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది లాస్య. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్‌తో సమ్‌థింగ్ స్పెషల్ అంటూ క్యూట్‌గా అందరిని నవ్వించేది. చురుకైన యాటిట్యూడ్‌తో, చలాకీ మాటలతో బుల్లితెరపై ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

అంతగా రాని క్రేజ్..
అయితే అనంతరం పలు వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్‌కు దూరంగా ఉన్న లాస్య బిగ్‌బాస్ సీజన్ 4తో బుల్లితెరపై మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ షో ద్వారా అంతగా క్రేజ్ దక్కించుకోలేకపోయిందనే చెప్పవచ్చు. ఆ తర్వాత ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి రకరకాల వీడియోలతో అలరిస్తూ వచ్చింది యాంకర్ లాస్య.

ఆస్పత్రి పాలైన లాస్య..
అయితే ఈ మధ్య అనుకోకుండా యాంకర్ లాస్య ఆస్పత్రి పాలైనట్లు, ఆ విషయాన్ని ఆమె భర్తే స్వయంగా చెప్పినట్లు వార్తలు విన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అనూహ్యంగా అభిమానులకు గుడ్ న్యూస్ తో వచ్చేసింది యాంకర్ లాస్య. తను మరోసారి తల్లిని కాబోతున్నట్లు ప్రకటించి అందరిని సంతోషపరిచింది.

మరోసారి ప్రెగ్నెంట్..
తన భర్తతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నేను ''మరోసారి తల్లిని కాబోతున్నాను. బేబి త్వరలో రానుంది. మరో రెండు చిట్టి పాదాలతో మా కుటుంబం మరింత పెద్దది కానుంది'' అని రాసుకొచ్చింది. ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిమానులతోపాటు నెటిజన్లు సైతం లాస్య దంపతులకు కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











