»   » ప్రేమించిన వ్యక్తితో యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్, వరుడు ఇతడే? (ఫోటోస్)

ప్రేమించిన వ్యక్తితో యాంకర్ లాస్య ఎంగేజ్మెంట్, వరుడు ఇతడే? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు బెల్లితెర ప్రేక్షకులకు యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. పలు టీవీ షోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లాస్య త్వరలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతోంది.

ఈ రోజు లాస్య ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని లాస్య తన సోషల్ మీడియా పేజీ ద్వారా వెల్లడించారు. వరుడి పేరు మంజునాథ్. తెలుగు కుర్రాడు కాదు... మరాఠీ కుర్రాడు. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. నా సోల్ మేట్ తో ఎంగేజ్మెంట్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమ ఎంతో విలువైనది అంటూ లాస్య పేర్కొన్నారు. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

 అభిమానులతో ఆనంద క్షణాలను షేర్ చేసుకున్న లాస్య

అభిమానులతో ఆనంద క్షణాలను షేర్ చేసుకున్న లాస్య

లాస్యకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ క్షణాలను లాస్య అభిమానులతో షేర్ చేసుకుంటూ ఈ పోస్టు చేసారు.

Picture Credit : Moment Makers

 చేతిపై టాటూ

చేతిపై టాటూ

ఇద్దరూ ఒకరి పేర్లను మరొకరు తమ చేతిపై టాటూగా వేయించుకున్నారు. అతడి పేరు మంజు అని, లాస్య ముద్దు పేరు చిన్ని అని తెలుస్తోంది.

Picture Credit : Moment Makers

 గతంలో పుకార్లు

గతంలో పుకార్లు

గతంలో లాస్యకు యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఎఫైర్ ఉన్నట్లు, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలను ఇద్దరూ తోసి పుచ్చారు.

రాజ్ తరుణ్ వివరణ

రాజ్ తరుణ్ వివరణ

'కేవలం ఒక్కసారి కుమారి 21ఎఫ్ ఆడియో రిలీజ్ లో కలిసిన లాస్యతో నా పెళ్లి చేసిన కొంత మంది మీడియా మిత్రులకు, వెబ్ సైట్ దారులకు నా కృతజ్ఞతలు' అంటూ మొదలు పెట్టిన రాజ్ తరుణ్, ఇలా వెటకారంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలని కోరాడు. అలాగే.. ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేసేవారిపై ఇంతకన్నా ఎలా స్పదించాలో తనకు తెలియదన్నాడు. మరో మూడేళ్లలోపు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, తను పెళ్లి వార్తను తానే అందరికీ తెలియజేస్తానని రాజ్ తరుణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వివాహం?

వివాహం?

అయితే వీరి వివాహం ఎప్పుడు? అనే విషయం ఇంకా ప్రకటించలేదు.

English summary
Anchor Lasya got engaged. Confirming the news, the anchor wrote on her social network handle "Getting Ready for a special day feels good 😁 Getting Engaged with my SoulMate...! ☺️ ☺️ Feeling Excited 🙈 🙈 ☺️, (sic)".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu