Anchor Lasya: హాస్పిటల్​ బెడ్​పై యాంకర్​ లాస్య.. అసలు ఏమైంది?

బుల్లితెరపై తనదైన శైలీలో యాంకర్​గా రాణించింది లాస్య. తన యాంకరింగ్​తో అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. ఒకప్పుడు యాంకర్​గా అదరగొట్టిన లాస్య ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్​తో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల యాంకరింగ్​కు దూరంగా ఉన్న లాస్య బిగ్​ బాస్ హౌజ్​లకో ఎంటరై మళ్లీ గుర్తింపు తెచ్చుకుంది. పలు వీడియోస్​తో సోషల్​ మీడియాలో అట్రాక్ట్ చేసే లాస్య ఆరోగ్యం ప్రస్తుతం బాగా లేదని తెలుస్తోంది.

చీమ ఏనుగు జోక్స్​తో..

చీమ ఏనుగు జోక్స్​తో..

ప్రముఖ యాంకర్​ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు బుల్లితెరపై తన యాంకరింగ్​తో అదరగొట్టింది. యాంకర్ రవి, లాస్య జోడికి మాములు రెస్పాన్స్ రాలేదు. యాంకరింగ్​లో వీరిద్దరి జోడి మోస్ట్​ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్లతో సహా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది లాస్య. ముఖ్యంగా చీమ ఏనుగు జోక్స్​తో సమ్​థింగ్​ స్పెషల్​ అంటూ క్యూట్​గా అందరని నవ్వించేది.

చలాకీ తనంతో..

చలాకీ తనంతో..

చురుకైన యాటిట్యూడ్​తో, చలాకీ మాటలతో బుల్లితెరపై ఆద్యంతం ఆకట్టుకుని ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అయితే అనంతరం పలు వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్​కు దూరంగా ఉన్న లాస్య బిగ్​బాస్ సీజన్​ 4తో బుల్లితెరపై మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ షో ద్వారా అంతగా క్రేజ్ దక్కించుకోలేకపోయింది. అనంతరం ఓ యూట్యూబ్ ఛానెల్​ ప్రారంభించి రకరకాల వీడియోలతో అలరిస్తూ వచ్చింది యాంకర్ లాస్య.

లాస్యకు ఏమైంది?

లాస్యకు ఏమైంది?

అయితే తాజాగా యాంకర్ లాస్య హాస్పిటల్​ పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని యాంకర్ లాస్య భర్త మంజునాథ్​ ఓ వీడియో ద్వారా తెలిపినట్లు సమాచారం. లాస్యకు ఆరోగ్యంగా సరిగ్గా లేదని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుందని తెలుపుతూ గెట్​ వెల్ సూన్​ అని ఓ పోస్ట్​ను షేర్​ చేశాడు. ఈ పోస్ట్ వైరల్​ కాగా యాంకర్ లాస్యకు ఏమైందని ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. అయితే ప్రస్తుతం యాంకర్ లాస్య ఆరోగ్యం బాగానే ఉందని, ఆమె ఆసుపత్రిలో చేరడానికి ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. మరీ ఈ విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X