లాస్యను అంటీ అంటే ఖబర్దార్.. అఖిల్‌కు భర్త వార్నింగ్, కథ వేరేలా ఉంది అంటూ సోహైల్ తండ్రి

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో ఆడుతూ దాదాపు 70 రోజులకుపైగా ఇంటి దూరమైన బిడ్డలను పలకరించేందుకు కంటెస్టెంట్ల తల్లిదండ్రులు వస్తున్నారు. 73వ రోజున ఇంటిలోకి అఖిల్ తల్లి దుర్గ, హారిక తల్లి, అభిజిత్ తల్లి లక్ష్మి, అవినాష్ తల్లి మల్లమ్మ ఇంటిలోకి వచ్చి కంటెస్టెంట్లను ఆనందంలో ముంచెత్తారు. ఇక 74వ రోజున ఇంటిలోకి సయ్యద్ సోహైల్ ర్యాన్, యాంకర్ లాస్య, అరియానా గ్లోరి పేరెంట్స్ ఇంటిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారిలో చెలరేగిన భావోద్వేగాలు ఎలా ఉన్నాయంటే..

సోహెల్ తండ్రి ఎంట్రీతో

సోహెల్ తండ్రి ఎంట్రీతో

కమాండెంట్ టాస్క్‌ కొనసాగుతున్న సమయంలో ఇంటిలోకి సోహెల్ తండ్రి ఇంట్లోకి ప్రవేశించారు. సోహెల్ బేటా అంటూ పిలవడంతో అందరూ ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో సోహెల్ ఫ్రీజ్ మోడ్‌లో ఉండటంతో కదల్లేకపోయాడు. సోహెల్‌ను ఒక్కరిని మినహాయించి అందర్నీ బిగ్‌బాస్ అన్ ఫ్రీజ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి సోహైల్‌ను కూడా అన్‌ఫ్రీజ్ చేయడంతో అందరూ కలిసి ముచ్చటించారు.

ఆ మాట విని ఎన్ని రోజులైందో

ఆ మాట విని ఎన్ని రోజులైందో

సోహైల్ తన తండ్రితో మాట్లాడుతూ.. నా నోట నుంచి బాపు అని పిలిచి ఎన్ని రోజులైందో అంటూ కంటతడి పెట్టుకొన్నాడు. అందుకు సమాధానంగా మూడు నెలలు అని చెప్పాడు. తండ్రితో మాట్లాడుతున్నంత సేపు భావోద్వేగంతో కదలిపోయాడు. అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉంది.. కానీ మీకు ఎప్పుడు ఎలాంటి టాస్క్‌లు ఇస్తున్నారనే టెన్షన్ మాకు ఉంది అంటూ సోహైల తండ్రి సమాధానం ఇచ్చారు.

కథ వేరేలా ఉంటుందనే డైలాగ్

కథ వేరేలా ఉంటుందనే డైలాగ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ తర్వాత జనం అందరూ కథ వేరేలా ఉంటుంది అనే డైలాగ్‌ను బయట చెబుతున్నారు. చిన్న పిల్లలు కూడా ఆ డైలాగ్‌ను ఉపయోగిస్తున్నారు అని సోహైల్ తండ్రి చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఇంటిలో మీరంత బాగా ఆడుతున్నారు. ఇలానే ఆడండి అంటూ సోహైల్ తండ్రి వెల్లడించారు.

జున్ను రాకతో లాస్య..

జున్ను రాకతో లాస్య..

ఆ తర్వాత ఇంటిలోకి యాంకర్ లాస్య భర్త మంజునాథ్ వచ్చారు. జున్ను ఇంటిలోకి వచ్చి అమ్మా అంటూ పిలువడం, ఆ తర్వాత మనం సినిమాలోని థీమ్ మ్యూజిక్ ప్లే చేయడంతో లాస్య అటెన్షన్ అయ్యారు. వెంటనే పరుగెత్తికెళ్లి జున్ను, మంజునాథ్‌తో మాట్లాడారు.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
 ఆంటీ అంటే.. జాగ్రత్త అంటూ మంజునాథ్

ఆంటీ అంటే.. జాగ్రత్త అంటూ మంజునాథ్

ఇక మంజునాథ్‌తో ఇంటి సభ్యులు మాట్లాడుతుండగా. ఏంటీ ఏంటీ అంటూ అఖిల్ కామెంట్ చేయగా.. ఆంటీ అంటే బాగుండదు. జాగ్రత్త అంటూ మంజునాథ్ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఇంటిలోకి వచ్చిన జున్నును అవినాష్ ఆడించారు. ముక్కుకు ఎర్రటి బంతి పెట్టుకొని జోకర్‌లా నవ్వించాడు. బిగ్‌బాస్ ఆదేశం రావడంతో జున్ను, మంజునాథ్ ఇంటి నుంచి ఎమోషనల్‌గా బయటకు వెళ్లారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X