Anchor Lasya: యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం.. ఆయన మృతితో పుట్టెడు దుఃఖంలో ఫ్యామిలీ!
యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అంతకు మించిన స్పాంటేనియస్ తో టాలెంటెడ్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చే అతికొద్ది మంది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ కూడా చేరిపోయింది. అయితే ప్రస్తుతం తన పిల్లలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండి యూట్యూబ్ ఛానెల నడుపుంటుకున్న ఈమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వీరి కుటుంబ పెద్ద ఈరోజు చనిపోగా.. తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు అంతా. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యాంకర్ లాస్య, రవితో కలిసి జోడీగా చేయగా.. విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరి కలిపి చేసిన షో వల్ల వీరిద్దరి కెరియర్ పీక్స్ కు చేరుకుంది. అయితే వీరిద్దరి మధ్య లవ్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు రాగా.. వాటన్నిటినీ కొట్టి పడేశారు. ఆ తర్వాతే ఈ క్యూట్ బ్యూటీ మంజునాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా తన కెరియర్ ను కొనసాగించింది. ఓ బాబు పుట్టాకా బిగ్ బాస్ షోలోకి కూడా ఎంట్రీ మరోసారి సందడి చేసింది. ఇటీవలే ఈ క్యూట్ బ్యూటీ రెండోసారి తల్లి అయింది. ఇద్దరు కుమారులు, భర్తతో చాలా హాయిగా గడుపుతోంది లాస్య.

అయితే తాజాగా వీరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వీరి కుటుంబ పెద్ద అయిన ఓ వ్యక్తి చనిపోయారు. ఆయన మరెవరో కాదు.. లాస్య మంజునాథ్ మామయ్య. అంటే లాస్య భర్త మంజునాథ్ తండ్రి. తాజాగా ఈయన చనిపోగా.. ఈ విషయాన్ని నేరుగా లాస్యనే తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా తెలిపింది. ఆయన ఫొటోను షేర్ చేసి మరీ... తన మామయ్య చనిపోయినట్లు వివరించింది. అంతేకాకుండా.. తన మనసులోని భావాలను కూడా రాసుకొచ్చింది.
మీరు భౌతికంగా మా మధ్య లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. అలాగే మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వివరించింది. మిస్ యూ పాపా అంటూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మంజునాథ్ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూనే.. మీరంతా ధైర్యంగా ఉండేలా ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నామంటూ నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ పోస్ట్ చూసేయండి.


Click it and Unblock the Notifications











