Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెండో పెళ్లి చేసుకోవాలి.. ఒక్క పెళ్లితో సరిపెట్టుకోవద్దు.. యాంకర్ లాస్యకు షాకిచ్చిన గంగవ్వ
బిగ్‌బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత యాంకర్ లాస్య కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను కలుసుకొంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. దేత్తడి హారిక, అభిజిత్ తదితర కంటెస్టెంట్ల ఇంటి సభ్యులను కలిసి మాట ముచ్చటతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా లంబాడ పల్లిలోని గంగవ్వ ఇంటిని లాస్య సందర్శించి తమ అనుభవాలను ఒకరికొకరు పంచుకొన్నారు. ఆ వివారాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఇంటిలో చాలా విషయాలు..
బిగ్‌బాస్ ఇంటిలో నాతో చాలా విషయాలు చెప్పేది. రాత్రి పూట చాలా సేపు మాట్లాడుకొనే వాళ్లం. జున్ను గురించి గుర్తు చేసుకొనేది. భర్తను తలుచుకొనేది. తన అమ్మ గురించి ఎక్కువగా చెప్పేది. ఒక్కోసారి తన కుమారుడు జున్ను గురించి గుర్తు చేసుకొని బాగా ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటూ గంగవ్వ బిగ్‌బాస్ ఇంటి ముచ్చట్లు లాస్యతో కలిసి పంచుకొన్నారు.
10 రోజులు బాధపడ్డాం
నీవు ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత 10 రోజులపాటు బాధపడ్డాం. ఎందుకంటే నీవు నాతో బాగా కనెక్ట్ అయ్యావు కదా.. నీవు ఉంటే బాగుండేది అని అనుకొన్నాను. కానీ నీ ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల మధ్యలోనే వచ్చావు అని లాస్య అన్నారు. నీకు ఇంటి నుంచి వచ్చిన తర్వాత నీకు ఎలా ఉందని లాస్య అడిగితే.. నేను కూడా బాధపడ్డాను. నీ ఇంటి వెళ్లి జున్ను చూసుకోవాలని అనుకొన్నాను అని గంగవ్వ చెప్పింది.
జున్ను కోసమే నా కష్టం
నేను ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు జున్ను గురించే ఆలోచించా బాధపడ్డాను అంటూ గంగవ్వ అంటూ... నేను ఇంటిలో ఎంత కష్టపడినా అది జున్ను కోసమే. అందుకోసమే నేను చాలా రోజులు బిగ్‌బాస్‌లో ఉండాలని కోరుకొన్నాను. నా కొడుకు మంచి స్కూల్లో చదువుకోవాలి. మంచి లైఫ్ అనుభవించాలి అంటూ గంగవ్వకు లాస్క చెప్పింది.
కొడుకు జున్ను గురించి బెంగపడకు
నీ కొడుకు గురించి నీవు బెంగపడకు. మంచి స్కూల్‌కు వెళ్తాడు. మంచిగా చదవుకొంటాడు. మంచిగా రెండు పెళ్లిళ్లు చేసుకొంటాడు అంటూ గంగవ్వ సరదాగా కామెంట్ చేసింది. రెండు పెళ్లిళ్లు ఎందుకే అవ్వ.. ఒక్కటి చాలూ అని లాస్క అంటే.. ఈ రోజుల్లో ఇద్దరు ఉండాలి అంటూ గంగవ్వ కామెంట్ చేసింది. అయితే మా వారికి నేను ఒక్కతినే.. మా అబ్బాయికి కూడా ఒక్కరే ఉండాలి అంటూ లాస్య చెప్పింది.
ముసలిది పోయిందనుకొన్నారా?
బిగ్‌బాస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఎలా ఉందని గంగవ్వ అడిగితే... అందరూ చాలా బాధపడ్డారు అని లాస్య చెప్పింది. అయితే ముసలిది పోయిందని అనుకొన్నారా అంటే.. అలా ఎవరు అనుకోలేదు. అందరితో నీవు బాగానే ఉన్నావు కదా అంటూ గంగవ్వకు లాస్య సర్ది చెప్పింది.
గంగవ్వ మాట పవర్ఫుల్
గంగవ్వ మాట చాలా పవర్ఫుల్. నోటి నుంచి ఏది వచ్చినా అది జరిగిపోతుంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు గంగవ్వ ఎవరి పేరు చెబితే వారు ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఫలానా వాళ్లు వెళ్లిపోతారంటూ పేరు చెప్పింది. కరెక్టుగా వారే వెళ్లిపోయారు. అలా ముగ్గురి పేర్లు చెప్పింది. అలాగే సుజాత పేరు కూడా వేదిక మీద చెప్పింది. అలానే సుజాత ఎలిమినేట్ అయింది అంటూ తన భర్తతో లాస్య చెప్పడం గమనార్హం.
డిసెంబర్ 20వ తేదీన ఫైనల్
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 చివరి దశకు చేరుకొన్నది. డిసెంబర్ 20వ తేదీ ఆదివారం జరిగే ఫైనల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది. ఇప్పటికే అభిజిత్, అరియానా, అఖిల్ సార్థక్, సోహెల్ సయ్యద్, దేత్తడి హారిక టాప్ 5 కంటెస్టుంట్లుగా ఉన్నారు. ఇప్పటికే విజేత కోసం భారీగా ఓటింగ్ జరుగుతుందూ ముందుకు సాగుతున్నది.