మళ్లీ పెళ్లికూతురిగా స్టార్ యాంకర్ .. మెడలో తాళితో ఫోటోలు వైరల్
తెలుగు తెరపై ఉన్న స్టార్ యాంకర్‌లలో లాస్య కూడా ఒకరు. యాంకర్ రవితో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకుని భర్త , పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది లాస్య. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే లాస్య.. ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటో షూట్‌లతో బిజీగా ఉంటారు. తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యాంకర్‌గా తెలుగునాట పాపులారిటీని సంపాదించుకున్న లాస్య.. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. హౌస్‌లో ఉన్నన్ని రోజులు తన ఆట తీరుతో తెలుగు లొగిళ్లకు మరింత దగ్గరైంది. అయితే ఆ తర్వాత కొద్దిరోజులు బుల్లితెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ.. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ హల్ చల్ చేసేది. ఓసారి తన బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తూ కనిపించి షాకిచ్చింది.

రైతు బిడ్డ అయిన లాస్య .. మంజునాథ్ అనే వ్యక్తితో ప్రేమలో పడి పెద్దలను ఎదిరించి ఆయనను పెళ్లాడారు. దీంతో వీరు పెద్దలకు దూరంగానే తమ జీవితాన్ని కొనసాగించారు. ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు అసహ్యించుకున్నారని బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయటపెట్టింది లాస్య. ఏడేళ్ల పాటు తమను దగ్గరికి రానివ్వలేదని.. తర్వాత మరోసారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే భర్తను రెండోసారి పెళ్లి చేసుకున్నానని చెప్పి ఎమోషనల్ అయ్యింది లాస్య.
తన తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తన భర్త ఎంతో సాయం చేశారని.. తద్వారా మూడు ప్లాస్టిక్ సర్జరీలు చేయించి తన తండ్రిని కాపాడుకున్నానని లాస్య తెలిపారు. ఈ ప్రమాదం తర్వాతి నుంచి తన భర్త ఎలాంటి వారో? ఆయన మనసు ఎలాంటిదో తన తండ్రికి బాగా తెలిసిందని.. నాటి నుంచి అల్లుడిని సొంత కొడుకులా చూసుకుంటున్నారని లాస్య చెప్పారు. ఇప్పటికే లాస్య దంపతులకు ఓ కుమారుడు ఉండగా.. ఇటీవల మరోసారి గర్భం దాల్చిన ఆమె గతేడాది మార్చిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం మెట్టినిల్లు, పుట్టినిల్లు నుంచి అన్ని రకాలుగా ప్రేమాభిమానులు పొందుతున్నానని లాస్య ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రతి సందర్భాన్నీ, పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడం లాస్యకు అలవాటు. తన ఫ్రెండ్స్, ఆత్మీయులతో సరదాగా ఎంజాయ్ చేస్తుంది. తాజాగా మరోసారి పెళ్లి కూతురిలా పట్టు చీర కట్టి, చేతికి మెహంది పెట్టి, మెడలో తాళితో ఉన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఓ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ప్రసారమైన ప్రోగ్రామ్ కోసం మంజునాథ్, లాస్యలు ఇలా పెళ్లి బట్టల్లో ముస్తాబయ్యారు. అసలు విషయం తెలియడంతో నెటిజన్లు, లాస్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


Click it and Unblock the Notifications











