Don't Miss!
- News
టర్కీలో తీవ్ర భూకంపం.. నిముషాల వ్యవధిలో రెండుసార్లు; రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు!!
- Sports
INDvsAUS : వాళ్లకు కూడా గాయాలైతే సిరీస్ ముగిసినట్లే.. ఆసీస్ టెస్టులపై పేలుతున్న మీమ్స్!
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హాట్ వీడియోతో షాకిచ్చిన యాంకర్ మంజూష: ఆమెను ఇలా చూస్తే తట్టుకోలేరు!
ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సత్తా చాటుతున్నారు. అందం, అద్భుతమైన టాలెంట్‌లో కొందరు టెలివిజన్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ హవాను చూపిస్తున్నారు. అయితే, పేరుకు యాంకరే అయినా బుల్లితెరపై కంటే ఎక్కువగా సినిమా ఫంక్షన్‌లే చేస్తూ తనదైన మార్కును చూపిస్తూ ముందుకెళ్తోంది గ్లామరస్ యాంకర్ మంజూష. టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ఈ బ్యూటీ.. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

అలా మొదలైన మంజూష కెరీర్
మంజూష రాంపల్లి మొదట మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి.. తన అందచందాలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలా ఆమె ఎంతో మంది సినీ, బుల్లితెర ప్రముఖుల దృష్టిలో పడింది. దీంతో ఈ తెలుగు పిల్లకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాంకర్‌గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆరంభంలోనే పలు అదిరిపోయే షోలను హోస్ట్ చేసింది.
బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

సినిమా ఛాన్స్.. తారక్‌కు రాఖీ
యాంకర్‌గా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో మంజూషకు అవకాశాలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ - క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్‌లో వచ్చిన 'రాఖీ'లో ఛాన్స్ పట్టేసింది. ఇందులో హీరో సోదరి పాత్రను పోషించిన మంజూష.. దానికి వందకు వంద శాతం న్యాయం చేసింది. ఆ తర్వాత కూడా ఆమెకు ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసింది.

యాంకర్‌గా దూసుకుపోతోంది
మొదట్లోనే మంజూష బుల్లితెరపై యాంకర్.. 'రాఖీ' సినిమాతో నటిగా తన సత్తాను నిరూపించుకుంది. కానీ, కొద్ది రోజులకు ఆమె అటు టీవీల్లోనూ, ఇటు సినిమాల్లోనూ చేయడం మానేసింది. ఈ క్రమంలోనే ఫ్రీలాన్స్ యాంకర్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా అప్పటి నుంచి దాదాపు 5000కు పైగా ఇంటర్వ్యూలు, కొన్ని వందల సినిమా ఫంక్షన్లను చేసి ప్రత్యేక గుర్తింపు పొందింది.
బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

ఎన్నో ఆఫర్లు... యాంకర్‌గానే
యాంకర్‌గా చేస్తున్న మంజూష బుల్లితెరపైకి, వెండితెరపై ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె జబర్ధస్త్ సహా పలు షోలలో హోస్టింగ్ చేయనుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి కూడా ప్రవేశించబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తుండడంతో నిత్యం వార్తల్లో ఉంటోంది.

అక్కడ మాత్రం ఫుల్ బిజీగా
అటు టీవీలో, ఇటు సినిమాల్లో పెద్దగా కనిపించకున్నా సోషల్ మీడియా ద్వారా యాంకర్ మంజూష తన అభిమానులతో మాత్రం నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది. అలాగే, తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌లో ఈమె పేరు ట్రెండ్ అవుతోంది.
హాట్ షోతో షాకిచ్చిన ఈషా రెబ్బా: పైనుంచి చూపిస్తూ రెచ్చిపోయిన తెలుగు పిల్ల
అందాల విందు చేస్తూ రచ్చ
సోషల్ మీడియా యాంకర్ మంజూష అప్పుడప్పుడు తన ఘాటు ఫోజులను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. వీటిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెళ్లో గాయాలు చేస్తోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతూనే ఉంటోంది.

హాట్ డ్యాన్స్ వీడియో వదిలి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ మంజూష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌తో పాటు టైట్ ప్యాంట్ ధరించి ఉంది. దీనికితోడు ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతోన్న పాటకు హాట్ హాట్ భంగిమలతో డ్యాన్స్ చేసింది. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. తక్కువ టైంలోనే వైరల్ అయిపోయింది.