టాప్ యాంకర్స్ కుళ్లుకునేలా మంజూష గ్లామర్ ట్రీట్.. ఈసారి మరింత ఘాటుగా.. స్టన్నింగ్!
టెలివిజన్ ప్రపంచంలో యాంకర్ అనే పదానికి కొందరు సరికొత్తగా అర్ధాన్ని తీసుకొస్తున్నారు. మొదట్లో చాలా ట్రెడిషనల్ గా నార్మల్ లుక్స్ లో కనిపించిన వారు కూడా ఇప్పుడు స్టైలిష్ గా మారిపోతున్నారు హీరోయిన్స్ కంటే ఘాటైన స్టిల్స్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇక ఆ తరహాలోనే ఎప్పటికప్పుడు తన డ్రెస్సింగ్ స్టైల్ తో గ్లామర్ తో షాక్ ఇస్తున్న యాంకర్స్ లలో మంజూష ఒకరు. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో ఎలాంటి ఈవెంట్ చేసిన కూడా తన గ్లామర్ తో కుర్రాళ్ళను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న కొన్ని ఫోటోల వివరాలలోకి వెళితే..
మొదట్లోనే మంచి నటిగా:యాంకర్ మంజుష.. అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. కేవలం యాంకర్ గానే కాకుండా ఈమె నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రాఖీ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలిగా ఎంతో ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఆ సినిమాలో మంజుష నటనకు మంచి మార్కులే పడ్డాయి. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుందీ క్యూట్ బ్యూటీ. అత్త పెడుతున్న బాధల్ని తట్టుకుంటూ ఆమె చేసిన నటన అందరినీ అలరించింది.

బుల్లితెరపై మాత్రమే కాకుండా..:కవేలం బుల్లితెరపై మాత్రమే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై చివరకు సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కనిపిస్తుంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ ఫ్రాక్ వేసుకొని స్టిల్ ఇచ్చింది.
నడుము ఒంపు సొంపులతో:స్ట్రెయిట్ కట్ స్లిట్ ఉన్న డ్రెస్సు వేసుకొని హై హీల్స్ వేసింది. హెయిర్ విరబోసుకుని క్యూట్ లుక్స్ ఇస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. నడుము ఒంపు సొంపులతో పాటు లెగ్స్ అందాలను కూడా స్పెషల్ గా చూపించింది. ఈ ముద్దుగుమ్మ అందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఆమె చాలా అందంగా కనిపిస్తోందని ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఫిదా:ఈ ఫొటోలు చూసిన ఈమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు అని కొందరు క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మంజుష అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినా యాంకర్ గానే ఆమెకు ఎక్కువ పేరు వచ్చింది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ నటులు, దర్శకులు, ప్రొడ్యూసర్లను ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ గా అదరగొడుతుంది.
ఫుల్ బిజీగా ఉంటూనే:ఓ వైపు యాంకరింగ్ లో ఫుల్ బిజీగా ఉంటూనే కాళీ సమయాల్లో సోషల్ మీడియాపై దృష్టి పెడుతుంటుంది.
ట్రెండ్ కు తగ్గట్టుగా తన స్టైల్ ను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు తన ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఈమె పెట్టే ఫొటోల కోసమే ఈమెను ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. ఏది ఏమైనా గ్లామర్ షో చేస్తూనే కుర్రకారును తనవైపు తిప్పుకుంటుదీ క్యూట్ బ్యూటీ. మరో రాబోయే రోజుల్లో అమ్మడు ఈ గ్లామర్ డోస్ ను ఇంకా ఏ లెవెల్ కు తీసుకు వెళుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











