జబర్ధస్త్ షోకు కొత్త యాంకర్: అనసూయ స్థానంలో క్రేజీ బ్యూటీ ఎంట్రీ
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షోలలో 'జబర్ధస్త్' ఒకటి. 2013లో ప్రారంభమైన ఈ కామెడీ షో.. వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయ్యేది. దానికి రెస్పాన్స్ మంచిగా వస్తుండడంతో రెండు రోజులకు పెంచారు. అప్పటి నుంచి జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ రెండూ టాప్ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కామెడీ షో నుంచి యాంకర్ అనసూయ తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆమెను భర్తీ చేసే యాంకర్ గురించి తాజాగా మరో వార్త లీక్ అయింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

ఎంతో మందికి జీవితాన్నిచ్చింది
దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతూ టాప్ కామెడీ షోగా పేరొందుతోంది జబర్ధస్త్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ షో ఎంతో పాపులర్ అయిందో.. అందులో పని చేస్తున్న వారూ క్రేజ్ సంపాదించుకున్నారు. దీని ద్వారా ఎంతో మంది కమెడియన్లు, రైటర్లు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు.

వాళ్లూ పాపులర్ అయిపోయారు
జబర్ధస్త్‌లో పని చేసే వాళ్లు ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. ఆ షోకు జడ్జ్‌లుగా పని చేసిన మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వారితో పాటు ఈ కామెడీ షోకు యాంకర్లుగా పని చేసిన అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ సైతం ఊహించని స్థాయిలో పాపులర్ అయిపోయారు.

కీ టైంలో జబర్ధస్త్‌కు ఎదురుదెబ్బ
పోటీగా వచ్చిన ఎన్నో షోలను దాటుకునిపోతోంది జబర్ధస్త్ కామెడీ షో. చాలా కాలంగా నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఈ షోకు కొదది రోజుల క్రితం భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ షోకు మొదటి నుంచీ జడ్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నాగబాబు.. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అంతేకాదు, ఆయనతో పాటు కొందరు ఆర్టిస్టులు సైతం షోకు గుడ్‌బై చెప్పేస్తున్నారు.

అప్పటి నుంచి ఆమెదే కీలక పాత్ర
మెగా బ్రదర్ నాగబాబు జబర్ధస్త్ షో నుంచి తప్పుకున్న తర్వాత మరో ఛానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు, ‘అదిరింది' అనే పేరుతో ఓ కామెడీ షోను ప్రారంభించారు. దీంతో జబర్దస్త్‌కు దాని నుంచి పోటీ ఎదురైంది. ఒకవైపు జడ్జ్ లేకపోవడం.. మరోవైపు పోటీ పెరగడం వంటి క్లిష్ట సమయంలో రోజా పెద్ద దిక్కుగా నిలిచారు. సింగిల్ జడ్జ్‌గా ఉంటూ షోను నడిపిస్తున్నారు.

జబర్ధస్త్ నుంచి అనసూయ ఔట్
చాలా కాలంగా జబర్ధస్త్‌లో యాంకర్‌గా పని చేస్తున్న హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్.. ఆ షో నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడిన సినిమాల షూటింగ్‌కు డేట్స్ అడ్జస్ట్ చేయడానికే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త యాంకర్‌గా ఎవరొస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

జబర్ధస్త్ షోకు మరో కొత్త యాంకర్
వారంలో రెండు రోజుల పాటు ప్రసారం అవుతోంది జబర్ధస్త్. ఇందులో గురువారం అనసూయ, శుక్రవారం రష్మీ యాంకరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు అనసూయ తప్పుకుంటుందన్న వార్తలు వెలువడుతున్న సమయంలో.. మరో కొత్త యాంకర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవరో కాదు.. ఎప్పటి నుంచో తెలుగు వాళ్లకు పరిచయం ఉన్న యాంకర్ మంజూష.
Recommended Video

అనసూయ స్థానంలో
మంజూష.. తెలుగు బుల్లితెరపై ఎన్నో టీవీ షోలు చేసింది. ఆ తర్వాత కొన్ని ప్రముఖ చానెళ్లలో యాంకర్‌గా పని చేసింది. అలాగే, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘రాఖీ'లో ఎన్టీఆర్ చెల్లెలి పాత్రలో నటించింది. దీనికి మంచి గుర్తింపు రావడంతో పాపులర్ అయిపోయింది. కొన్నేళ్లుగా సినిమా ఫంక్షన్లతో బిజీగా గడుపుతోన్న ఆమె.. ఇప్పుడు జబర్ధస్త్‌లోకి ఎంటర్ అవుతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











