For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Anchor Manjusha వీడియో క్లిప్ వైరల్.. టాప్ హీరోయిన్‌‌కు ఏ మాత్రం తగ్గకుండా స్టెప్పులతో జోరు

  |

  టాలీవుడ్‌లో హీరోయిన్ కావాలనే కలతో అడుగుపెట్టిన మంజూష రాంపల్లి రూట్ మార్చి టాప్ యాంకర్‌గా స్థిరపడిపోయింది. అయితే నటిగా కావాలనే కోరిక మాత్రం ఇంకా తీరలేదనేది ఆమె పోస్టులు, సన్నిహితులతో పంచుకొనే విషయాలతో స్పష్టమవుతుంది. యాంకర్‌గా రాణిస్తూనే అప్పడప్పుడు సినిమా తెరపై మెరుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తూ.. నెటిజన్లకు, ఫాలోవర్స్‌ను ఆకట్టుకొంటున్నది. తాజాగా ఆమె పోస్టు చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్‌గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

  రాఖీ సినిమాతో ఎంట్రీ

  రాఖీ సినిమాతో ఎంట్రీ

  యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి రాఖీ చిత్రం ద్వారా మంజూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. రాఖీ చిత్రంలో ఎన్టీఆర్‌కు చెల్లెలుగా నటించి తన నటనతో అందర్నీ మెప్పించింది. అయితే అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో యాంకరింగ్‌పై దృష్టిపెట్టింది. యాంకర్‌గా అవకాశాలు తలుపుతట్టడంతో స్టార్ యాంకర్‌గా మారింది.

  టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా

  టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా


  యాంకర్‌గా మారిన మంజూష కొద్దికాలంలో దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ యాంకర్‌ స్థానాన్ని సంపాదించుకొన్నది. పరిస్థితులకు తగినట్టుగా సమయస్పూర్తి, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ తీరుతో సినీ వర్గాలను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ, ప్రెస్ మీట్ గానీ, అవార్డుల ఫంక్షన్ గానీ.. తనదైన మార్క్ పంచులు, వాగ్ధాటితో మంజూష ఆకర్షిస్తుంటారు.

  స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి

  స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి


  యాంకర్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికీ.. మంజూష నటిగా రాణించే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన ఆఫర్లను ఆమె అంది పుచ్చుకొంటున్నారు. ఇటీవల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, ఐటెమ్ సాంగ్స్ హావా పెరగడంతో వాటిపై దష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. అయితే స్పెషల్ సాంగ్స్ చేయడానికి, మంచి పాత్రలు లభిస్తే నటించడానికి సిద్ధమే అంటూ సన్నిహితులతో మనసులో మాటను వెల్లడించినట్టు సమాచారం.

  సోషల్ మీడియాలో రీల్స్‌తో

  సోషల్ మీడియాలో రీల్స్‌తో


  మంజూష యాంకర్‌గా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలతో హంగామా చేస్తున్నారు. తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకొనే విధంగా డ్యాన్స్ వీడియోలు పోస్టు చేస్తూ గణనీయంగా అభిమానాన్ని సంపాదించుకొంటున్నారు. మంజూషకు స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా 2.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం ఆమెకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుంది.

  నీ స్మైల్ వెనుక సీక్రెట్ ఏంటి?

  మంజూష ఇటీవల పోస్టు చేసిన వీడియోలకు నెటిజన్ల నుంచి భారీగా రెస్సాన్స్ వస్తున్నది. గుప్పెడంత గుండెల్లోనే అనే ఖవాళీ పాటకు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోను పోస్టు చేసింది. కేవలం కొద్ది గంటల్లోనే ఈ వీడియోకు సుమారు ఎనిమిది వేల లైకస్, భారీగా కామెంట్లు రావడం జరిగింది. నీ అందం, నీ స్మైల్ వెనుక రహస్యం ఏమిటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  పూజా హెగ్డే అరబిక్ కుత్తు పాటకు రీల్

  తాజాగా పూజాహెగ్డే, విజయ్ నటించిన బీస్ట్ పాటపై స్టెప్పులు వేసింది. లేటేస్ట్ సాంగ్ సెన్సేషన్ అరబిక్ కుత్తు పాట గురించి పోస్టు పెడుతూ.. డార్లింగ్ పూజా హెగ్డే గ్రేస్ ఈ పాటలో సూపర్. ఆ పాట తెచ్చిన క్రేజ్‌తో ఈ డ్యాన్స్ చేయలేక ఉండలేకపోయాను అని మంజూష వీడియోను పోస్టు చేసింది. మంచి గ్రేస్‌తో స్టెప్పులేసి.. తాను కూడా స్పెషల్ సాంగ్స్ సిద్దమనే విధంగా హింట్ ఇచ్చింది.

  English summary
  Anchor Manjusha's Dance reel for Pooja Hegde's Arabic Kuthu shakes internet. She wrote on her Instagram that, This darling hegdepooja ‘s grace is something else..😍Couldn’t stop myself doing this.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X