Bigg Boss Telugu 6: ఐపీఎల్​ యాంకర్​ నుంచి బిగ్​బాస్ కంటెస్టెంట్​ వరకు.. నేహా చౌదరీ జర్నీ ఇదే..

దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రియాలిటీ షోలలో బిగ్​బాస్​ షో ముందుంటుంది. ఈ బిగ్​బాస్ షో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అందుకే ఏ షోకి లేని క్రేజ్​ను సంపాందించుకుంది. కంటెస్టెంట్లు, టాస్క్​లు వంటి తదితర ఆసక్తికర అంశాలతో మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్​గా వస్తోంది బిగ్​బాస్​ ఆరో సీజన్. ఇక ఎప్పుడెప్పుడూ ప్రారంభం అవుతుందా అని తెలుగు ఆడియెన్స్​ వేయి కళ్లతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. సెప్టెంబర్​ 4వ తేది నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్​బాస్​ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది ప్రముఖ ఐపీఎల్ యాంకర్ నేహా చౌదరి. మరి ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!

క్యూరియాసిటీ..

క్యూరియాసిటీ..

తెలుగులో బిగ్​ బాస్ ప్రారంభమై సూపర్ హిట్ సాధించింది. ఇక అప్పటి నుంచి ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లపై ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ నెలకొంటుంది. సినీ సెలబ్రిటీల నుంచి సోషల్ మీడియా స్టార్లతోపాటు పలువురు కామన్ పీపుల్స్​ను బిగ్​బాస్ హౌజ్​లోకి పంపిస్తూ సూపర్​ ప్లే చేస్తాడు బిగ్​బాస్​.

ఆసక్తిగా ఆట..

ఆసక్తిగా ఆట..

ఈ షోలో పాల్గొనే సభ్యుల నుంచి వారు గేమ్​లో ఆడే టాస్క్​లు, చివరిగా గెలిచే విజేత వరకూ ఎప్పుడు ఆసక్తిగానే సాగుతుంది. ఇలా ఆసక్తికగా సాగే ఆటలో కంటెస్టెంట్​లు కీలకం. అలాంటి కంటెస్టెంట్​ల జాబితాలో చోటు సంపాందించుకుంది ప్రముఖ ఐపీఎల్​ యాంకర్​ నేహా చౌదరి.

2012 నుంచి యాంకర్​గా..

2012 నుంచి యాంకర్​గా..

టెలివిజన్​ యాంకర్​గా పాపులర్​ అయింది నేహా చౌదరి. ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతిలో జన్మించిన నేహా చౌదరి 2012 నుంచి యాంకర్​గా కొనసాగుతోంది. 2020-21లో జరిగిన ఇండియన్​ ప్రీమియల్ లీగ్​ (ఐపీఎల్​)కు స్టార్ స్పోర్ట్స్​ తెలుగులో యాంకర్​గా మోస్ట్​ పాపులర్​ అయింది నేహ చౌదరి.

క్రికెట్​ మ్యాచ్​లకు హోస్ట్​గా..

క్రికెట్​ మ్యాచ్​లకు హోస్ట్​గా..


2020లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్​ వన్డే సిరీస్​ వంటి తదితర మ్యాచ్​లకు హోస్ట్​గా వ్యవహరించింది. అంతేకాకుండా 2020లో జరిగిన ఇండియా వర్సెస్​ ఆస్ట్రేలియా టీ20 మహిళల ప్రపంచకప్​కు ప్రజెంటర్​గా పనిచేసింది. అలాగే 2019లో వివో ప్రో కబడ్డీకి స్టార్​ స్పోర్ట్స్​ తెలుగులో వ్యాఖ్యాతగా వ్యవహరించింది నేహా చౌదరి.

నిజం టీవి సిరీస్​లో..

నిజం టీవి సిరీస్​లో..


అయితే యాంకర్​గా సక్సెస్​ఫుల్​గా కొనసాగిన నేహా చౌదరి అథ్లేట్​గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలను కలలు కంది. నేహా చౌదరి యాంకర్​ కాకుండా ఈటీవీ ప్లస్​లో 2020 మార్చి 9న ప్రసారమైన నిజం టీవీ సిరీస్​లో నటించింది కూడా.

జాతీయ అవార్డులు..

జాతీయ అవార్డులు..

నేహా చౌదరి యాంకరింగ్​తోపాటు నటి, డ్యాన్సర్​, మోడల్​, యోగా ట్రైనర్​, స్విమ్మర్​ కూడా. జిమ్నాస్టిక్​లో అనేక జాతీయ అవార్డులను కూడా సాధించింది. యువ కళావాహిని ఎక్సలెన్స్​ అవార్డులలో ఉత్తమ యాంకర్​ అవార్డును గెలుచుకుంది. సెప్టెంబర్​ 11న తిరుపతిలో జన్మించిన నేహా చౌదరిది మధ్య తరగతి కుటుంబం. ఆమెకు ఒక ట్విన్​ బ్రదర్​ కూడా ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X