Bigg Boss Telugu 6: పెళ్లి సంబంధం పక్కన పెట్టి మరీ.. నేహా చౌదరి ఆసక్తికర కామెంట్స్​

వేయి కళ్లతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఎంతో పాపులరై అత్యధిక అభిమానులను సంపాదించుకున్న బిగ్​బాస్ తెలుగు రియాలిటీ షో కొత్త సీజన్​ చాలా గ్రాండ్​గా ప్రారంభమైంది. సెప్టెంబర్​ 4వ తేది ఆదివారం రోజున ప్రారంభమైన ఈ సీజన్​లో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ నేహా చౌదరి దుమ్మురేపే డ్యాన్స్ పర్ఫామెన్స్​తో అదరగొట్టి ఎం​ట్రీ ఇచ్చింది. అయితే తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ.

అదిరిపోయిన నాగార్జున ఎంట్రీ..

అదిరిపోయిన నాగార్జున ఎంట్రీ..

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్​బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్​ ఎట్టకేలకు చాలా గ్రాండ్​గా ప్రారంభమైంది. వైట్ డ్రెస్​లో హోస్ట్​, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. మొదట కంటెస్టెంట్​గా సీరియల్​ నటి కీర్తి భట్​ ఎంటర్​ అవగా.. రెండో సభ్యురాలిగా సుదీప బిగ్​బాస్​ హౌజ్​లోకి అడుగు పెట్టింది.

నాలుగో కంటెస్టెంట్​గా..

నాలుగో కంటెస్టెంట్​గా..

వీళ్ల తర్వాత ఇద్దరు మహిళా కంటెస్టెంట్ల తర్వాత శ్రీహాన్ మంచి డ్యాన్స్​ పర్ఫామెన్స్​తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాలుగో కంటెస్ట్​గా గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చింది యాంకర్​, జిమ్మాస్టిక్​, నటి నేహా చౌదరి. రారా రక్కమ్మ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేసి.. జోష్ తీసుకొచ్చింది.

మెట్టలు పెట్టుకుని..

మెట్టలు పెట్టుకుని..

తన పర్ఫామెన్స్​ తర్వాత పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది నేహా చౌదరి. తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఈ బిగ్​బాస్ అవకాశం వచ్చిందని తెలిపింది. పెళ్లి చేసుకుని, మెట్టలు పెట్టుకుని బిగ్​బాస్​కు వెళ్లడం.. అదంతా ఎందుకని, ఇది నా కెరీర్​, నా ఫ్యూచర్​ అని చెప్పి బిగ్​బాస్​కు వచ్చినట్లు పేర్కొంది నేహా చౌదరి.

గ్రీక్​ వీరుడులా..

గ్రీక్​ వీరుడులా..

మరి పెళ్లి చేసుకునే వాడు ఎలా ఉండాలని నాగార్జున అడిగిన ప్రశ్నకు.. మీలా.. గ్రీక్​ వీరుడిలా ఉండాలని చెప్పింది నేహా చౌదరి. దీంతో నీ గ్రీక్ వీరుడిని నువ్వే బొమ్మ గీయు అని నాగార్జున చెప్తాడు. దీంతో అక్కడ టేబుల్​పై ఉన్న ఫొటో క్లిప్స్​తో ఒక ముఖం చేస్తుంది నేహా. కానీ అదంతా క్లియర్​గా ఉండదు.

ఫాక్స్​ కార్డ్..

ఫాక్స్​ కార్డ్..

తర్వాత ఒక కార్డు తీసుకోమ్మని నేహాకు చెప్పగా.. తీసుకుంటుంది నేహా చౌదరి. ఆ కార్డులో ఫాక్స్​ వస్తుంది. దీంతో ఆ ఫాక్స్​ కథేంటనేది హౌజ్​లోకి వెళ్లాక తెలుస్తుంది అని నాగార్జున చెప్తాడు. దీంతో బిగ్​బాస్ హౌజ్​లోకి వెళ్లిన నేహా చౌదరి.. శ్రీహాన్, సుదీప, కీర్తి భట్​ను కలిసి మాట్లాడుతుంది.

 జిమ్నాస్టిక్​లో..

జిమ్నాస్టిక్​లో..

అయితే ఇదే ఫాక్స్ కార్డు ఇదివరకు శ్రీహాన్​కు కూడా వస్తుంది. ఇక నేహా చౌదరి యాంకర్​గా కెరీర్ మొదలు పెట్టి.. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్​ను సంపాదించుకుంది. స్పోర్ట్స్​ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చిన నేహా చౌదరి.. రిథమిక్​ జిమ్నాస్టిక్స్​ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్​ సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X