Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Bigg Boss Telugu 6: పెళ్లి సంబంధం పక్కన పెట్టి మరీ.. నేహా చౌదరి ఆసక్తికర కామెంట్స్
వేయి కళ్లతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఎంతో పాపులరై అత్యధిక అభిమానులను సంపాదించుకున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో కొత్త సీజన్ చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 4వ తేది ఆదివారం రోజున ప్రారంభమైన ఈ సీజన్లో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ యాంకర్ నేహా చౌదరి దుమ్మురేపే డ్యాన్స్ పర్ఫామెన్స్తో అదరగొట్టి ఎంట్రీ ఇచ్చింది. అయితే తన పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పి ఆశ్చర్యపరిచింది ఈ బ్యూటీ.
అదిరిపోయిన నాగార్జున ఎంట్రీ..
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో నాలుగో సీజన్ ఎట్టకేలకు చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. వైట్ డ్రెస్‌లో హోస్ట్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. మొదట కంటెస్టెంట్‌గా సీరియల్ నటి కీర్తి భట్ ఎంటర్ అవగా.. రెండో సభ్యురాలిగా సుదీప బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టింది.
నాలుగో కంటెస్టెంట్‌గా..
వీళ్ల తర్వాత ఇద్దరు మహిళా కంటెస్టెంట్ల తర్వాత శ్రీహాన్ మంచి డ్యాన్స్ పర్ఫామెన్స్తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక నాలుగో కంటెస్ట్‌గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది యాంకర్, జిమ్మాస్టిక్, నటి నేహా చౌదరి. రారా రక్కమ్మ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేసి.. జోష్ తీసుకొచ్చింది.
మెట్టలు పెట్టుకుని..
తన పర్ఫామెన్స్ తర్వాత పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది నేహా చౌదరి. తనకు పెళ్లి సంబంధాలు చూస్తుండగా ఈ బిగ్‌బాస్ అవకాశం వచ్చిందని తెలిపింది. పెళ్లి చేసుకుని, మెట్టలు పెట్టుకుని బిగ్‌బాస్‌కు వెళ్లడం.. అదంతా ఎందుకని, ఇది నా కెరీర్, నా ఫ్యూచర్ అని చెప్పి బిగ్‌బాస్‌కు వచ్చినట్లు పేర్కొంది నేహా చౌదరి.
గ్రీక్ వీరుడులా..
మరి పెళ్లి చేసుకునే వాడు ఎలా ఉండాలని నాగార్జున అడిగిన ప్రశ్నకు.. మీలా.. గ్రీక్ వీరుడిలా ఉండాలని చెప్పింది నేహా చౌదరి. దీంతో నీ గ్రీక్ వీరుడిని నువ్వే బొమ్మ గీయు అని నాగార్జున చెప్తాడు. దీంతో అక్కడ టేబుల్‌పై ఉన్న ఫొటో క్లిప్స్‌తో ఒక ముఖం చేస్తుంది నేహా. కానీ అదంతా క్లియర్‌గా ఉండదు.
ఫాక్స్ కార్డ్..
తర్వాత ఒక కార్డు తీసుకోమ్మని నేహాకు చెప్పగా.. తీసుకుంటుంది నేహా చౌదరి. ఆ కార్డులో ఫాక్స్ వస్తుంది. దీంతో ఆ ఫాక్స్ కథేంటనేది హౌజ్‌లోకి వెళ్లాక తెలుస్తుంది అని నాగార్జున చెప్తాడు. దీంతో బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లిన నేహా చౌదరి.. శ్రీహాన్, సుదీప, కీర్తి భట్‌ను కలిసి మాట్లాడుతుంది.
జిమ్నాస్టిక్‌లో..
అయితే ఇదే ఫాక్స్ కార్డు ఇదివరకు శ్రీహాన్‌కు కూడా వస్తుంది. ఇక నేహా చౌదరి యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ను సంపాదించుకుంది. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన నేహా చౌదరి.. రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ సాధించింది.