Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి నిహారిక ఫ్రెండ్.. అప్పుడు అతడిని గెలిపించి.. ఇప్పుడు షోలోకి ఎంట్రీ

తెలుగు బుల్లితెరపై అప్పటి వరకూ ఉన్న సరిహద్దులను చెరిపేస్తూ.. సరికొత్త కంటెంట్‌ను ప్రేక్షకులకు చూపించిన ఏకైక షో బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా దీనికి ఊహించని రీతిలో అత్యధిక రేటింగ్ దక్కింది. దీంతో ఇండియాలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా ఇది రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్లను వరుస పెట్టి పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో సీజన్‌ను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీ? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఐదు కంప్లీట్.. ఆరో సీజన్ ప్లాన్

ఐదు కంప్లీట్.. ఆరో సీజన్ ప్లాన్


తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని.. బిగ్ బాస్ ఐదు సీజన్లను భారీ స్థాయి రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. అలాగే, కొద్ది రోజుల క్రితమే ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా విజయవంతంగా నడిపారు. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేసింది.

అప్పటి నుంచే.. కామన్ మ్యాన్

అప్పటి నుంచే.. కామన్ మ్యాన్


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ ఆరో సీజన్ ఎప్పుటి నుంచి మొదలు అవుతుంది అనే దానిపై ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. దీన్ని వచ్చే సెప్టెంబర్ మొదటి వారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు. ఇందులో ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఇప్పుడు జరుగుతోన్న పనులు

ఇప్పుడు జరుగుతోన్న పనులు


బిగ్ బాస్ సీజన్ కోసం నిర్వహకులు మూడు నెలల ముందు నుంచే ప్రాసెస్‌ను స్టార్ట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే ఆరో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. అంతేకాదు, ఇప్పటికే సెట్ వర్క్‌ను కూడా చాలా వరకూ చేసుకుంటూ వచ్చారు. ఇది గతంలో చూడని విధంగా అత్యంత సుందరంగా ఉండబోతుందట.

ఎన్నో పేర్లు లీక్.. ట్రెండింగ్‌లో

ఎన్నో పేర్లు లీక్.. ట్రెండింగ్‌లో


సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే, అసలు ఇందులో ఎవరు పాల్గొంటారన్న దానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. మొత్తానికి బిగ్ బాస్ మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్ అవుతోంది.

 బిగ్ బాస్‌లోకి యంగ్ యాంకర్

బిగ్ బాస్‌లోకి యంగ్ యాంకర్

ఆరో సీజన్‌లో పాల్గొనే వాళ్ల జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. అయితే, అందులో ఎవరు కన్ఫార్మ్ అయ్యారో మాత్రం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సెలెబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ రేడియో జాకీ కమ్ యాంకర్ అయిన నిఖిల్. అతడు నిహారిక కొణిదెలకు క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నిఖిల్

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నిఖిల్


రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోన్నాడు నిఖిల్. ఈ క్రమంలోనే అతడు పలు చిత్రాల్లో కూడా భాగం అయ్యాడు. దీంతో ఈ కుర్రాడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దీంతో ఇప్పుడు అతడిని బిగ్ బాస్ నిర్వహకులు ఆరో సీజన్ కోసం సంప్రదించారట. ఇందుకోసం భారీ ఆఫర్ ఇవ్వగా.. నిఖిల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది.

అప్పుడు అతడిని గెలిపించి

అప్పుడు అతడిని గెలిపించి

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన నిఖిల్‌ బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అయిపోయింది. ఇప్పటికే అతడు దీనికి అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడని తెలుస్తోంది. ఐదో సీజన్‌లో సన్నీ కోసం అతడు షోలోకి కూడా వచ్చాడు. అతడి విజయం కోసం బాగా శ్రమించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్వయంగా బిగ్ బాస్ షోలోకి అడుగు పెడుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X