Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. ‘అత్త’తో కలిసి హౌస్‌లో రచ్చే
తెలుగు బుల్లితెరపై ఉన్న బౌండరీలు అన్నీ చెరిపేసే కంటెంట్‌ను ప్రసారం చేస్తూ.. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోన్న ఏకైక షో బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ రియాలిటీ షో.. భారీ స్పందనను అందుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకోవడంతో పాటు రేటింగ్ పరంగా నేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే మరో కంటెస్టెంట్ పేరు లీకైంది. ఆ వివరాలను మీరే చూసేయండి మరి!
ఆరు కంప్లీట్.. ఏడో సీజన్ ప్లాన్:బుల్లితెర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని.. బిగ్ బాస్ ఆరు సీజన్లను భారీ స్థాయి రేటింగ్‌తో పూర్తి చేసుకుంది. అలాగే, కొద్ది రోజుల క్రితమే ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా విజయవంతంగా నడిపారు. ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్‌ను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.

అప్పటి నుంచే.. సరికొత్తగానే:ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ ఏడో సీజన్ ఎప్పుటి నుంచి మొదలు అవుతుంది అనే దానిపై ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. దీన్ని వచ్చే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలు పెట్టబోతున్నారు. ఇది గతంలో ఎన్నడూ చూడని సరికొత్త ట్విస్టులు, టాస్కులు, కంటెంట్‌తో జరగబోతుంది. ఈ సీజన్‌ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు జరుగుతోన్న వర్క్స్:సాధారణంగా బిగ్ బాస్ సీజన్ కోసం నిర్వహకులు మూడు నెలల ముందు నుంచే ప్రాసెస్‌ను స్టార్ట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే ఏడో సీజన్ కోసం కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో ఒక రౌండ్‌ను కూడా పూర్తి చేసి షార్ట్ లిస్ట్ రెడీ చేశారు. అంతేకాదు, ఇప్పటికే సెట్ వర్క్‌ను కూడా చాలా వరకూ చేసేశారు. ఇది గతంలో చూడని విధంగా కలర్‌ఫుల్‌గా ఉండబోతుందని టాక్.

ఎన్నో పేర్లు లీక్.. ట్రెండింగ్:సెప్టెంబర్‌లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి.. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ గురించి ఎన్నో రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి. కానీ, అసలు ఇందులో ఎవరు పాల్గొంటారన్న దానిపై క్లారిటీ మాత్రం రావట్లేదు. మొత్తానికి బిగ్ బాస్ మాత్రం నిత్యం ట్రెండింగ్ అవుతోంది.

బిగ్ బాస్‌లోకి నిహారిక ఫ్రెండ్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పాల్గొనే వాళ్ల జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో సెలెబ్రిటీ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఆర్జే కమ్ యాంకర్ అయిన నిఖిల్. నిహారిక కొణిదెల క్లోజ్ ఫ్రెండ్ అయిన అతడికి గతంలోనూ ఆఫర్ వచ్చింది. కానీ, అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడట.

గతంలో కంటే మంచి ఆఫర్:రేడియో జాకీగా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే నిఖిల్ ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే అతడు కొన్ని షోలు, పలు చిత్రాల్లో కూడా నటించాడు. దీంతో ఈ కుర్రాడి కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. గతంలో ఓటీటీ, ఆరో సీజన్లకు కూడా అతడితో నిర్వహకులు చర్చలు జరిపారు. కానీ, ఇప్పుడు భారీ మొత్తం ఆఫర్ చేయడంతో నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన టాక్.

అత్త కూడా హౌస్‌లో రచ్చే:నిఖిల్ ప్రస్తుతం సుప్రీత (సురేఖ వాణి కూతురు'తో డేటింగ్‌లో ఉన్నాడని టాక్ వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇక, అతడు బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అయిపోయింది. అలాగే ఇదే సీజన్‌లోకి సురేఖ వాణి కూడా ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. అదే జరిగితే హౌస్‌లో 'అత్త అల్లుడు' రచ్చ రచ్చ చేస్తారని కొందరు అంటున్నారు.


Click it and Unblock the Notifications











