twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుల్లితెరపై మరో కొత్త కహానీ.. యాంకర్ ప్రదీప్-పూర్ణ లవ్ ట్రాక్!!

    |

    బుల్లితెరపై ఏదైనా షో సక్సెస్ అవ్వాలంటే కెమిస్ట్రినే ఇంపార్టెంట్. యాంకర్ల మధ్యనో, కంటెస్టెంట్ల మధ్యనో ఏదో తెలిసీ తెలియన, కనీ కనిపించని బంధం ఒకటి ఉండాలి. అలాంటప్పుడే ప్రేక్షకులు వాటికి ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. అదే స్ట్రాటజీనీ రవి లాస్య, రవి శ్రీముఖి, సుధీర్ రష్మీ, హైపర్ ఆది వర్షిణి ఫాలో అవుతూ వచ్చారు. తాజాగా మరో కొత్త జోడి తెరపైకి వచ్చింది.

    కవ్విస్తూ.. మెప్పిస్తూ..

    కవ్విస్తూ.. మెప్పిస్తూ..

    బుల్లితెరపై ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ షోలకు బాగా క్రేజ్ ఏర్పడింది. వీటిలో జోడీల మధ్య ఉండే కెమిస్ట్రీయే మరింత హైలెట్ అవుతూ ఉంటుంది. రోజా శేఖర్ మాస్టర్‌ల మీద ఇప్పటికే లెక్కలేనన్ని స్కిట్స్, ఈవెంట్స్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. ఇలా జోడీలుగా నటించి.. బుల్లితెరపై ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు.

    ఢీ షోలో రచ్చ..

    ఢీ షోలో రచ్చ..

    ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తూ డ్యాన్సులతో పాటు వినోదాన్ని కూడా అందిస్తున్నారు. అందులో భాగంగానే రష్మీ సుధీర్, వర్షిణి హైపర్ ఆదిలను తెగ వాడేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్, ప్రియమణిల మధ్య కూడా ఏదో ఉందన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కొత్తగా ఓ జంట తెరపైకి వచ్చేసింది.

     పూర్ణ-ప్రదీప్‌ల రొమాన్స్..

    పూర్ణ-ప్రదీప్‌ల రొమాన్స్..

    ఇక తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమోలో పూర్ణ ప్రదీప్ రెచ్చిపోయారు. పూర్ణలా మారిపోయి డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది ఓ కంటెస్టెంట్. ఢీ షోలో వచ్చాక నువ్ మారిపోయావ్ పూర్ణ అంటూ ఓ అమ్మాయి.. ఖడ్గం సినిమాలోని అహా అల్లరి అల్లరి చూపులతో అనే పాటకు ప్రదీప్‌ను చూసుకుంటూ డ్యాన్స్ చేసింది.

    Recommended Video

    Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
    ప్రదీప్ అంటే క్రష్..

    ప్రదీప్ అంటే క్రష్..

    ఇక ఆ పర్ఫామెన్స్ అయ్యాక పూర్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పర్ఫామెన్స్ చేశారని కాదు గానీ నాకు ప్రదీప్ అంటే క్రష్ అంటూ మనసులో మాట బయటకు చెప్పేసింది. ఇక ఆపై స్టేజ్ మీదకు వచ్చి ప్రదీప్‌ను మెప్పించడానికి పూర్ణ వేసిన స్టెప్పులు, ఇద్దరూ కలిసి పండించిన రొమాన్స్‌కు ప్రోమో బ్లాక్ బస్టర్ అయింది. ఇక పూర్తి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మొత్తానికి పూర్ణ-ప్రదీప్ జోడి ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి.

    English summary
    Anchor Pradeep And Poorna Romantic Performance In Dhee Show. In recent Promo Poorna Reveals That She Has Crush On Praddep.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X