twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు క్రష్ అని చెప్పింది.. ఇప్పుడు ఏకంగా భార్యగా.. ప్రదీప్-పూర్ణ కథ వేరేలా ఉందే!!

    |

    యాంకర్ ప్రదీప్, హీరోయిన్ పూర్ణ మధ్య ఏదో ఉందనేట్టుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే, దానికి తగ్గట్టుగా వీరిద్దరి వ్యవహార శైలి కూడా అలానే ఉంది. గత ఎపిసోడ్‌లో ప్రదీప్ అంటే క్రష్ అని జడ్జ్‌గా ఉన్న పూర్ణ చెప్పడం, స్టేజ్ పైకి వచ్చి పర్ఫామెన్స్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరు ఏకంగా భార్యభర్తలుగా నటించేశారు. అందులో పూర్ణ ఓ రేంజ్‌లో జీవించేసింది. ఇంతకీ ఆ కథ ఏంటో ఓ సారి చూద్దాం.

    ఢీ షోలో వారిదే హవా..

    ఢీ షోలో వారిదే హవా..

    ఢీ షో ఒకప్పుడు డ్యాన్సులే ప్రధానంగా సాగేది.. కానీ ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ డ్యాన్సులతో పాటుగా ఎంటర్టైన్మెంట్‌ను జోడించి చూపిస్తున్నారు. ఇందుకోసం సుధీర్ రష్మీ హైపర్ ఆది వర్షిణి ఇలా అందర్నీ తీసుకొచ్చారు. ఇక యాంకర్‌గా ప్రదీప్ ఎప్పుడూ రఫ్ఫాడిస్తూనే ఉంటాడు.

    జడ్జ్‌లు సైతం..

    జడ్జ్‌లు సైతం..

    ఒకప్పుడు ఢీ షో జడ్జ్‌లు ఓ లెవెల్ ఉండేది. ఇప్పుడు అందులోనూ కామెడీ, సెటైర్లు వచ్చేశాయి. పూర్ణ, ప్రియమణి, శేఖర్ మాస్టర్, యానీ మాస్టర్, బాబా మాస్టర్ ఇలా జడ్జ్‌లందరూ ఎంటర్టైన్మెంట్ లెవెల్‌ను పెంచుతున్నారు. వీరు కూడా స్టేజ్ ఎక్కి పర్ఫామెన్స్, స్కిట్స్ చేస్తూ కామెడీ చేస్తున్నారు.

    ప్రదీప్ అంటే క్రష్.

    ప్రదీప్ అంటే క్రష్.

    ఢీ షోలో గతంలో ఓ సారి ప్రదీప్ పూర్ణ ట్రాక్‌పై ఓ పర్ఫామెన్స్‌ను చేశారు. అది చూసిన పూర్ణ.. ప్రదీప్ అంటే క్రష్ అంటూ మనసులో మాట బయటకు చెప్పేసింది. ఇక ఆపై స్టేజ్ మీదకు వచ్చి ప్రదీప్‌ను మెప్పించడానికి పూర్ణ వేసిన స్టెప్పులు, ఇద్దరూ కలిసి పండించిన రొమాన్స్‌ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
    తాజాగా స్కిట్..

    తాజాగా స్కిట్..

    ఢీ షోలో డ్యాన్సులు ఎంతగా ఉంటాయో కామెడీ స్కిట్స్ అన్ని ఉంటాయి. వచ్చే వారం ఎపిసోడ్‌లో ప్రదీప్ పూర్ణ భార్యభర్తలుగా స్కిట్ వేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో పూర్ణ నిజంగానే జీవించేసినట్టు అనిపిస్తోంది. ఏవండి కాఫీ కావాలా? ఏం వండమంటారు? అంటూ ప్రదీప్‌పై ప్రేమను కురిపించింది. ప్రదీప్, పూర్ణలను సుధీర్, ఆది ఆంటీ, అంకుల్ అని పిలిచారు. దీంతో ప్రదీప్ వారిద్దరిపై కౌంటర్లు వేశాడు. మొత్తానికి ఈ స్కిట్ ద్వారా మళ్లీ పూర్ణ ప్రదీప్ వార్తల్లో నిలిచారు.

    English summary
    Anchor Pradeep And Poorna Skit In Dhee Show, Anchor Pradeep And Poorna Romantic Performance In Dhee Show. In recent Promo Poorna Reveals That She Has Crush On Praddep.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X