ప్రియా అంటూ ఏకంగా అలా కూర్చోబెట్టేసుకున్నాడు.. ప్రియమణితో హైపర్ ఆది పులిహోర!!
బుల్లితెరపై షోలో ట్రాకులు, పులిహోర కాన్సెప్ట్‌లు ఎక్కువవుతున్నాయి. అసలు అలాంటి మ్యాటర్ లేదంటే అవి క్లిక్ కావేమో అనేంతగా అందరూ ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రతీ షోలో ట్రాకులు పెట్టేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఢీ షోలో ప్రియమణి, హైపర్ ఆది, వర్షిణి, రష్మీ, సుధీర్, శేఖర్ మాస్టర్ ఇలా ఎంతో మంది ఉన్నారు. వీరిలో ప్రదీప్ కూడా ఎంతో సమయస్ఫూర్తిగా ఎవరితో ట్రాకు నడపాలో లెక్కలు కూడా వేసుకుంటాడు. అటు వర్షిణి ఇటు రష్మీ.. మరో వైపు జడ్జ్‌లతో క్లోజ్‌గానే ఉంటాడు. తాజాగా కొత్తగా ప్రారంభమైన సీజన్‌లో ట్రాకులు మారిపోయాయి.

కొత్త సీజన్‌లో అలా..
ఢీ పదమూడో సీజన్ షో గ్రాండ్‌గా ప్రారంభమైంది. పాత సీజన్‌లో ఉన్న వారే ఇందులోనూ ఎంటర్టైన్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈ సారి వర్షిణి హైపర్ ఆది ట్రాక్ మాత్రం కనిపించదు. వర్షిణి స్థానంలో టిక్ టాక్ స్టార్ దీపిక పిల్లి ఎంట్రీఇచ్చింది. అయితే ఆమె అంతగా ఫేమస్ అయ్యేలా కనిపించడం లేదు.

కొత్త ట్రాకు..
ఇక నుంచి ఈ కొత్త సీజన్‌లో హైపర్ ఆది కొత్త అవతారమెత్తాడు. వర్షిణి లేకపోవడంతో ప్రియమణితో పులిహెర కలిపేందుకు సిద్దమయ్యాడు. ప్రియమణిని ఇకపై ప్రియా అనిపిలుస్తాడట. ఈ మేరకు ఈ ఇద్దరితో కాసింత ట్రాకు నడిచింపి టీఆర్పీ పెంచుకోవాలనే భావనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

మోకాళ్ల మీద నిల్చుని..
ప్రియా నా గుండె లయ.. అంటూ కవిత్వం చెబుతూ ప్రియమణి ముందు ఆది మోకాళ్ల మీద కూర్చున్నాడు. అలా ఆది కూర్చుని తన తొడల మీద ప్రియమణిని కూర్చోబెట్టుకున్నాడు. మొత్తానికి ప్రియమణి టచ్‌తో ఆదికి ఏదో అయిపోయినట్టుంది. ఈ కొత్త సీజన్‌లో ఈ కొత్త ట్రాక్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

దీపిక పిల్లి..
ఎంతో సూపర్ హిట్ అయిన వర్షిణి ఆది జంటను కాదని.. టిక్ టాక్ స్టార్ దీపికను పట్టుకొచ్చారు. అయితేఈ ప్రోమోలో పట్టుమని రెండు మూడు షాట్లు కూడా దీపిక మీద కనిపించలేదు. అయితే ఈమె ఈ షోతో క్లిక్ అవ్వడం కాస్త కష్టమయ్యేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











