ఆ పని వల్లే అభిజీత్ గెలుపొందాడు: బిగ్ బాస్ విన్నర్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్ వైరల్

తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లు సత్తా చాటుతున్నారు. గ్లామర్‌తో కొందరు టాలెంట్‌తో మరికొందరు సక్సెస్ అవుతున్నారు. మొత్తానికి చాలా కాలంగా తమ హవాను చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేల్ యాంకర్ అయి ఉండి కూడా ఈ రంగంలో రాణిస్తున్నాడు ప్రదీప్ మాచిరాజు. లేడీ యాంకర్లు పోటీగా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే సినిమా హీరోగానూ పరిచయం అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రదీప్.. బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్ అభిజీత్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

రేడియో జాకీ నుంచి బెస్ట్ యాంకర్‌గా

రేడియో జాకీ నుంచి బెస్ట్ యాంకర్‌గా

కెరీర్ ఆరంభంలో రేడియో జాకీగా పని చేశాడు ప్రదీప్ మాచిరాజు. ఆ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న అతడు.. ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్' అనే షోతో యాంకర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అదే ఛానెల్‌లో వచ్చిన ‘గడసరి అత్త సొగసరి కోడలు' షోతో భారీ స్థాయిలో పాపులర్ అయ్యాడు. అంతేకాదు, ఈ షో ద్వారా ఉత్తమ యాంకర్‌గా నంది అవార్డును సైతం అందుకున్నాడు.

అన్ని షోలలో అతడే.. టైమింగ్‌తో సత్తా

అన్ని షోలలో అతడే.. టైమింగ్‌తో సత్తా

సుదీర్ఘమైన యాంకరింగ్ కెరీర్‌లో ప్రదీప్ ఎన్నో షోలలో పని చేశాడు. అన్ని చోట్లా తనదైన శైలి టైమింగ్‌తో కామెడీని పంచుతూ ఆకట్టుకున్నాడు. ‘ఢీ' డ్యాన్స్‌ షోలో అతడు చేసే సందడి అంతా ఇంతా కాదు. అదొక్కటే కాదు.. ప్రతి షోలోనూ ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్నాడీ స్టార్ యాంకర్. జీ తెలుగు ఛానెల్‌లో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను' అనే షోను సొంతంగా ప్రారంభించాడు ప్రదీప్.

సినిమా హీరోగా మారిన టాప్ యాంకర్

సినిమా హీరోగా మారిన టాప్ యాంకర్

బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా వెలుగొందుతోన్న ప్రదీప్.. కొన్ని సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. మున్నా అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించిన ఇందులో ప్రదీప్ లవ్ గురూగా నటించాడు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రంలోని ‘నీలి నీలి ఆకాశం' పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే.

బిగ్ బాస్ 4 విన్నర్‌పై ప్రదీప్ అంచనా

బిగ్ బాస్ 4 విన్నర్‌పై ప్రదీప్ అంచనా

వరుస షోలు.. సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు యాంకర్ ప్రదీప్. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో గురించి స్పందించాడు. అదంటే తనకు ఇష్టమని, ఖాళీ సమయాల్లో చూస్తుంటానని చెప్పాడు. అలాగే, ఈ సీజన్ విన్నర్ ఎవరనుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అభిజీత్ పేరును చెప్పాడు ప్రదీప్.

విన్నర్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

విన్నర్‌పై యాంకర్ ప్రదీప్ కామెంట్స్

ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశాడు ప్రదీప్. ఆ సమయంలో ఆ సినిమాతో పాటు తన డెబ్యూ మూవీ గురించి చాలా విషయాలు వెల్లడించాడు. అంతేకాదు, బిగ్ బాస్ నాలుగో సీజన్ విన్నర్‌పై మీ అంచనా నిజమైందని యాంకర్ అనగా... ‘నేను చెప్పడం వల్ల అభిజీత్ విన్నర్ అవలేదు. అతడు ఆడడం వల్లే అయ్యాడు' అని చెప్పుకొచ్చాడు.

అలా చేయడం వల్లే అభిజీత్ గెలిచాడు

అలా చేయడం వల్లే అభిజీత్ గెలిచాడు

అభిజీత్ గెలవడంపై ప్రదీప్ మాట్లాడుతూ.. ‘బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకే అదంటే నాకిష్టం. హౌస్‌లో అన్ని రోజులు ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ, అభిజీత్ మంచిగా ఆడాడు. కూల్ అండ్ కామ్‌గా ఉంటూ నెగ్గాడు. అతడు విజయం సాధించడంపై సంతోషంగా ఉంది' అని వివరించాడు. దీంతో ఈ కామెంట్స్‌ను అభి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X