యాంకర్ ప్రదీప్‌పై మరో కేసు? ఒకవేళ అదే జరిగితే.. 5 రోజుల జైలు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా సెలబ్రిటీలకు, ప్రముఖుల పిల్లలకు హైదరాబాద్ పోలీసులు జబర్దస్త్ షాక్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీగా జరిమానా, శిక్ష విధిస్తామంటూ చేసిన హెచ్చరికలను బేఖాతరు
Recommended Video

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా సెలబ్రిటీలకు, ప్రముఖుల పిల్లలకు హైదరాబాద్ పోలీసులు జబర్దస్త్ షాక్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే భారీగా జరిమానా, శిక్ష విధిస్తామంటూ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేసిన వాహనదారులు భారీ మూల్యాన్నే చెల్లించుకొనే అవకాశం కనపడుతున్నది.

మీడియాలో హైలెట్‌గా ప్రదీప్
కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో పోలీసులు నిర్వహించిన తనిఖీలలో ప్రముఖ టెలివిజన్ యాంకర్ ప్రదీప్ పట్టుబడటం మీడియాలో హైలెట్‌గా మారింది. నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపిన ప్రదీప్‌పై కేసు నమోదు చేసి కౌన్సిలింగ్‌కు పంపిచనున్నారు.

రూల్స్‌కు వ్యతిరేకంగా
సాధారణంగా మద్యం తాగి వాహనం నడుపుతూ బ్రీత్ ఎనలైజ్ టెస్టులో పట్టుబడితే 35 పాయింట్లు దాటితే జైలు శిక్షతో పాటు, వాహనం సీజ్ చేయాలని నిబంధనలు రూపొందించారు. కానీ ప్రదీప్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించగా 178 పాయింట్లు నమోదయ్యాయి.

ప్రదీప్ జరిమానా చెల్లించారు
బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 45 వద్ద ప్రదీప్ కారును ఆపి తనిఖీ చేశాం. బ్రీత్ ఎనలైజ్ చేయగా 178 పాయింట్లు నమోదు కావడంతో ఆయనపై కేసు నమోదు చేశాం, ప్రదీప్ మాత్రం జరిమానా చెల్లించి వెళ్లిపోయారు.

బ్లాక్ ఫిల్మ్ కారులో
ఇక ప్రదీప్ తెలిసే మరో తప్పు చేశాడు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వాహనదారులు బ్లాక్ ఫిల్మ్ ఉన్న గ్లాసులను కార్లకు బిగించవద్దు. కారుకు ముందు వెనుక గ్లాసులు కనీసం 70 శాతం పారదర్శకంగా ఉండాలి. అలాగే విండో గ్లాసులు 50 శాతం వరకు పారదర్శకంగా ఉండాలి. కానీ ప్రదీప్ బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారును వాడటం సీరియస్‌గా మారింది.



Click it and Unblock the Notifications











