యాంకర్ ప్రదీప్ వివాదంపై సుమ, అనసూయ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే..
Recommended Video

నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ప్రదీప్‌ను పోలీసులు పట్టుకొన్న సంగతి తెలిసిందే. మద్యం సేవించినట్టు గుర్తించిన పోలీసులు ఆయనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయిట్లు నమోదైంది.
ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. కానీ పోలీసులు నిర్వహించే కౌన్సిలింగ్‌కు ప్రదీప్ హాజరుకాకపోవడంతో ఈ వివాదం మీడియాలో మరింత నానుతున్నది. ఈ నేపథ్యంలో ప్రదీప్ వివాదంపై టాప్ యాంకర్లు సుమ, అనసూయ తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ప్రదీప్ మంచి వ్యక్తి
సుమ స్పందిస్తూ.. ప్రదీప్ చాలా మంచి వ్యక్తి. అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రదీప్ గురించి ఎవరిని అడిగినా చక్కగా చెబుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకొంటాడు. కానీ మద్యం తాగి వాహనం నడపటం చాలా తప్పు అని అన్నారు.

పొరపాట్లు జరగడం సాధారణం
ప్రతీ ఒక్కరి జీవితంలో పొరపాట్లు జరగడం సర్వసాధారణం. ప్రదీప్ తెలిసో తెలియకో తప్పు చేశాడు. అంతమాత్రాన ఆయనపై అంత ఘోరంగా సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో స్పందించడం బాధాకరం అని సుమ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కుటుంబం కుంగిపోయింది
ఇప్పటికే ప్రదీప్‌పై వస్తున్న వార్తలపై కుటుంబ సభ్యులు కుంగిపోయారు. వారిని ఇంకా బాధపెట్టేలా రాయకండి. చట్టం తనపని తాను చేసుకుపోతున్నది. గత కొన్నేళ్లుగా యాంకర్‌గా రాణిస్తున్న ప్రదీప్‌పై ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఆయనపై తప్పులు చేసినట్టు కూడా ఎన్నడూ ఓ వార్త రాలేదు అని సుమ మీడియాతో అన్నట్టు సమాచారం.

మద్యం తీసుకోవడం సాధారణం
అనసూయ వెల్లడించినట్టు వస్తున్న వార్తల ప్రకారం.. న్యూ ఇయర్ పార్టీలో మద్యం తీసుకోవడం సర్వసాధారణం. కానీ ప్రదీప్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఏదిఏమైనా నిబంధనలు ఉల్లంఘించిన ప్రదీప్ మూల్యం చెల్లించాల్సిందే అని ఓ యూట్యూబ్ చానెల్‌తో అన్నట్టు సమాచారం.

అలా ఎలా నడుపుతారు
మద్యం సేవించి వాహనం నడపటం తప్పు అని ప్రదీప్ ప్రచారం చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి వ్యక్తే తాగి ఎలా వాహనం నడుపుతారని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











