యాంకర్ ప్రదీప్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరంటే.. వీడియో వైరల్
Recommended Video

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారంలో దొరికిన యాంకర్ ప్రదీప్ వార్త మీడియాలో ప్రముఖంగా నిలిచింది. అయితే పోలీసుల కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకాకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి ప్రముఖుల నుంచి భారీ స్థాయిలో పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు కూడా ఊహాగానాలు జోరందుకొన్నాయి. అయితే ప్రదీప్‌తో పాటు కారులో ఉన్న ఓ యాంకర్, సినీ నటి ఎవరు అనేది మరో చర్చకు దారి తీసింది. యాంకర్ ప్రదీప్ ఆదివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన విషయం తెలిసిందే.

అమ్మాయిలతో ఫుల్లుగా
కారులో పట్టుపడటానికి ముందు పార్టీలో అమ్మాయిలతో ఫుల్లుగా మద్యం సేవించారనే మాట వినిపిస్తున్నది. ప్రదీప్ పక్కనే తెల్లటి డ్రస్సులో ఉన్న యాంకర్, వెనుక సీట్లో బ్లాక్ డ్రస్‌లో ఉన్న సినీతార ఎవరనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

అమ్మాయిలను వదిలేసిన ..
ప్రదీప్‌తోపాటు మద్యం మత్తులో ఉన్న అమ్మాయిలను అధికారులు వదిలేయడం వెనుక తప్పులేకపోయినప్పటికీ ఎవరై ఉంటారా అని మీడియా ప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఆమె పేరున్న యాంకరే అనే మాట వినిపిస్తున్నది.

అమ్మాయిలతో సంబంధం
ప్రదీప్ పక్కన ఉన్న మహిళ ఎవరు? ప్రదీప్‌కు ఆమెకు ఉన్న సంబంధమేంటి? మద్యం మత్తులో వేరే కారులో ఎక్కిన యువతులు ఎవరు? అని విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కౌన్సిలింగ్‌కు గైర్హాజరు
నూతన సంవత్సరం రోజున అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ మందుబాబులకు పోలీసులు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే ఈ కౌన్సిలింగ్‌కు ప్రదీప్ హాజరుకాలేదు. అయితే మీడియా దృష్టి ప్రధానంగా ఉన్న కారణంగానే ప్రదీప్ కౌన్సెలింగ్‌కు గైర్హాజరై ఉండొచ్చనే వాదన వినిపిస్తున్నది.

ఈ రోజు వరకే డెడ్‌లైన్
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనపుదారులకు బుధవారం (3వ తేది వరకు) డైడ్‌లైన్ ఉంది. ఒకవేళ బుధవారం వరకు హాజరుకాకపోతే వారిపై చార్జీషీట్ దాఖలు చేసి వారెంట్లు జారీ చేస్తామని పోలీసులు వెల్లడిస్తున్నారు. ఆ నిబంధన ప్రదీప్‌కు కూడా వర్తిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ప్రదీప్‌పై చర్యలకు సిద్ధం
కౌన్సెలింగ్ ప్రదీప్ హాజరుకాకపోతే దానిని బట్టి తదుపరి చర్యలు తీసుకొంటాం. తాగి వాహనం నడపటం వలన కలిగే దుష్ర్పభావాల గురించి ప్రదీప్‌కు వివరిస్తాం. అనంతరం కోర్టులో హాజరుపరుస్తాం.

జరిమానా? జైలుశిక్ష?
మద్యం సేవించిన మోతాదును, రికార్డైన పాయింట్లను బట్టి జరిమానా లేదా జైలుశిక్ష లేదా ఆ రెండు విధించే అవకాశం ఉంటుంది అని పోలీసులు పేర్కొన్నారు.

ప్రదీప్ వీడియో వైరల్
ఇదిలా ఉండగా, మద్యం సేవించి వాహనం నడుపరాదు. తాగి మద్యం సేవిస్తే మరొకరి జీవితానికి హానీకలుగవచ్చు. సీట్ బెల్టు కట్టుకోవాలి అని అని ప్రదీప్ గతేడాది జూలై 26న రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. చెప్పడానికే నీతులు ఉంటాయనే వాదన వినిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











