ఢీ షోలో ఊహించని సంఘటన: లైవ్‌లో చొక్కా చించేసిన హీరోయిన్.. తొలిసారి ఏడ్చేసిన యాంకర్ ప్రదీప్
తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్లు హవాను చూపిస్తున్నా.. దాదాపు పదేళ్లకు పైగానే తనదైన హోస్టింగ్‌తో నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతూ దూసుకుపోతోన్నాడు ప్రదీప్ మాచిరాజు. అదిరిపోయే వాక్చాతుర్యంతో పాటు స్పాంటీనియస్‌గా పంచులు వేస్తూ తనదైన రీతిలో అలరిస్తోన్న అతడు.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా షోల మీద షోలు చేస్తూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢీ షోలో అతడు ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్‌లో యాంకర్ ప్రదీప్ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీరే చూడండి!
దక్షిణాదిలోనే నెంబర్ వన్:తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల డ్యాన్స్ షోలు ప్రసారం అయ్యాయి. అయితే, అందులో 'ఢీ' మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకుంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. అందుకు తగ్గట్లుగానే టీఆర్పీని క్రమంగా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ డ్యాన్స్ షోగా సత్తా చాటుతోంది.

15వ సీజన్.. మరింత రచ్చ:ఇప్పటికే 'ఢీ' షో పద్నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే పదిహేనో దానిని కూడా కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. 'చాంపియన్స్ బ్యాటిల్' పేరిట ప్రసారం అవుతున్న ఈ సీజన్‌లో.. గతంలో మాదిరిగా కాకుండా మొత్తం కొత్త వాళ్లను తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతోంది. అందుకే గతంలో కంటే కంటెస్టెంట్లు మరింతగా రచ్చ చేస్తోన్నారు.
వాళ్లంతా కలిసి.. ప్రదీప్‌దే:'చాంపియన్స్ బ్యాటిల్' సీజన్‌ను ఏ అండ్ బీ అనే రెండు టీమ్‌ల మధ్య జరుపుతున్నారు. ఈ సీజన్‌కు హైపర్ ఆది, జస్వంత్ పడాల, దివ్యలను మెంటర్లుగా పెట్టారు. ఈ సీజన్‌కు జడ్జ్‌లుగా శేఖర్ మాస్టర్, శ్రద్దా దాస్‌లు వ్యవహరిస్తున్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. వీళ్ల కామెడీతో పదిహేనో సీజన్‌కు టీఆర్పీ కూడా భారీగానే దక్కుతూ దూసుకుపోతోంది.

అతడు వచ్చాక హైలైట్‌గా:'ఢీ 15' షోలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ వైల్డ్ కార్డు ద్వారా ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడు వచ్చినప్పటి నుంచి షోలో కామెడీ మరింత ఎక్కువైపోయింది. ముఖ్యంగా అతడు ప్రతి ఎపిసోడ్‌లోనూ తనదైన రీతిలో కామెడీని పండిస్తున్నాడు. దీంతో అందరి కంటే అతడే హైలైట్ అవుతున్నాడు. మొత్తంగా అతడి రాకతో షో రేంజ్ పెరిగిపోయింది.
వచ్చే వారం డ్యాన్స్‌తోనే:వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో ప్రతి కంటెస్టెంట్ తమదైన రీతిలో డ్యాన్స్ చేసి జడ్జ్‌లతో పాటు అక్కడున్న వాళ్లను మెస్మరైజ్ చేసేశారు. అంతేకాదు, గతంలో ఎన్నడూ చూడని పవర్‌ఫుల్ స్టెప్పులు వేసి యమ అలరించారు. దీంతో ఈ ప్రోమో వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారింది.

పండు షర్ట్ చించేసింది:రాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు జరుగుతోన్న సమయంలో పండు మాస్టర్ ఆడియెన్స్ నుంచి ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ట్రైన్‌లో టీ అమ్ముతున్నట్లు నటించి నవ్వులు తెప్పించాడు. ఆ తర్వాత శ్రద్దా దాస్ ఓ పెర్ఫార్మెన్స్ అయిన తర్వాత పేపర్ చించడం బదులుగా పండు మాస్టర్ షర్ట్‌ను చించేసింది. దీంతో అతడు అర్ధనగ్నంగానే కనిపించాడు.
తొలిసారి ఏడ్చిన ప్రదీప్:ఈ ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్ తండ్రికి సంబంధించిన సాంగ్‌కు పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి అక్కడున్న వాళ్లందరూ ఏడ్చేశారు. అప్పుడే గతంలో తండ్రిని కోల్పోయిన యాంకర్ ప్రదీప్ కూడా ఎమోషనల్ అయిపోయాడు. దీంతో పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్‌ను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు. దీంతో ఈ ఎపిసోడ్ మొత్తం డ్యాన్స్, నవ్వులు, ఎమోషనల్ సీన్స్‌తో నిండిపోయింది.


Click it and Unblock the Notifications











