నేను ఏం తప్పు చేశాన్రా.. నన్నే ఎందుకిలా చేస్తారు.. యువతి రేప్ ఆరోపణలపై ప్రదీప్ ఎమోషనల్

తాజాగా యాంకర్ ప్రదీప్ వార్తల్లో నిలిచాడు. గత రెండు మూడు రోజులుగా ప్రదీప్‌పై ఘోరమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడినట్టు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ జాబితాలో యాంకర్‌ ప్రదీప్‌ పేరు కూడా ఉండటంతీ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై ప్రదీప్ స్పందించాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి ఎమోషనల్ అయ్యాడు.

ప్రతీచోటా అదే..

ప్రతీచోటా అదే..

సోషల్ మీడియా ఉన్నది మంచి కోసం.. కానీ ఇలానా వాడేది? ఎవరు చేసే పని వారు చేస్తున్నారు కదా..నిజంద ఉందనుకోండి.. అది బయటకు వస్తుంది.. దీని వెనుకు ఎవరు ఉన్నారు.. అందరినీ బయటకు తీసుకు వస్తాను..కానీ అన్నింటికంటే ముఖ్యం ఈ సోషల్ మీడియాలో న్యూస్‌ను క్రియేట్ చేస్తే ఎంతమంది బాధపడతారు.. నేను అనే కాదు నా కొలీగ్స్ అని అని కాదు ప్రతీచోట.. ప్రతీ ఇండస్ట్రీలో ప్రతీ చోటా ఈ సోషల్ ట్రోలింగ్ ఎక్కువ అయిపోతోంది అని ప్రదీప్ పేర్కొన్నాడు.

 అది తప్పా ఇంకోటి రాదు..

అది తప్పా ఇంకోటి రాదు..

ఇలాంటి వాటికి వ్యతిరేకంగా నిలబడండి..ఒకరి గురించి మాట్లాడితే వాళ్ల కుటుంబం ఎంతలా బాధపడుతుంది..మనకీ ఓ కుటుంబం ఉంటుంది.. అని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా.. మాకు మేము సపోర్ట చేసుకుంటూ ఏం కాదులే అనకుంటూ మనం ఉన్నది జనాలను ఎంటర్టైన్ చేయడానికి మనకి అది తప్ప ఇంకోటి రాదు..వారిని నవ్విద్దాం..ఇదే ప్రయత్నంలో ఉంటాను..

నేను ఏం తప్పు చేశానురా..

నేను ఏం తప్పు చేశానురా..

నేను మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చి.. ఒక్కడ్నే వచ్చి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా. అందర్నీ కలుపుకుంటూ ఈ స్థాయికి వచ్చింది కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే. నాకు అది తప్పా ఇంకోటి రాదు..నాకు తోచినంత వరకు ఎవరికైనా సాయం చేస్తాను..తప్పా ఇంత వరకు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు..కానీ నా మీద ఇలాంటి నిందలు ఆరోపణలు వేస్తుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా? నేనేం తప్పు చేశానురా.. నా పేరు ఎందుకు ఇలా వాడుతున్నారురా అని అనిపిస్తుంది..

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
ప్రతీసారి అంతే..

ప్రతీసారి అంతే..

ఇప్పుడే కాదండి..ఇది వరకు ఫేక్ అకౌంట్స్ విషయంలో, ఆత్మహత్య చేసుకున్నాడని, అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడని, కాలు ఫ్యాక్చర్ ఇంట్లో కూర్చుంటే అరుదైన వ్యాధి అంటూ ఇలా ఏవేవో ఆరోపణలు చేశారు. ప్రతీసారి క్లారిటీ ఇస్తూ వచ్చాను. అన్నీ ఫేక్ అని తెలిశాక ఎవ్వరైనా తప్పు రాశారని, క్షమించమని అంటారా? అనరు. కానీ ఇప్పుడు జరుగుతున్న చాలా సున్నితమైన అంశం.. ఓ ఆడపిల్ల ఇష్యూ..ఆ టాపిక్‌లో నా పేరు లాగి యాంకర్ ప్రదీప్ అలా ఇలా అని వార్తలు రాస్తే ఎంత దారుణంగా ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X