ప్రదీప్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ షోలో ఎంటర్‌టైన్ చేయడానికి ఎంటరైన యాంకర్
ఓ వైపు మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారితే.. మరోవైపు తెలుగు బుల్లితెరపై అంతకు మించి నాటకీయత చోటు చేసుకుంటోంది. ఎవ్వరు ఏ చానెల్‌లో ఉంటున్నారో, ఏ ప్రోగ్రామ్‌కు జంప్ అవుతున్నారో తెలియడం లేదు. స్కిట్లతో వివాదాలు సృష్టించిన జబర్దస్త్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక విషయాలకు కేంద్ర బిందువైంది. జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు రావడంతో సోషల్ మీడియాలో బిగ్ డిబెట్‌కు దారి తీసింది.

కొత్త చానెల్‌లో కొత్త ప్రోగ్రామ్..
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన నాగబాబు వేరే చానెల్‌లో ఓ రెండు కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభించేశాడు. తాను వెళ్లడమే కాకుండా జబర్దస్త్ కంటెస్టెంట్లను కూడా తీసుకెళ్లాడు. తనకు దగ్గరగా ఉండే ప్రదీప్, శేఖర్ మాష్టర్, అనసూయ లాంటి వాళ్లను కూడా అక్కడికి లాగేశాడు. గతవారమే ఆ రెండు ప్రోగ్రామ్‌లు గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి.

ఢీ షోకు ప్రదీప్ దూరం..
నాగబాబుతో కలిసి జంప్ అయిన ప్రదీప్ ఇక ఈటీవీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడంటూ రూమర్స్ వచ్చాయి. ఇకనుంచి ఢీ షోకు ప్రదీప్ యాంకర్‌గా ఉండబోడనే న్యూస్ వైరల్ అయ్యాయి. దీంతో అతని అభిమానులు, ఢీ షోను ఇష్టపడే ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. అయితే వారందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చినట్టే.

గ్యాప్ ఇచ్చిన ప్రదీప్..
సుడిగాలి సుధీర్, రష్మీ, ప్రియమణి, వర్షిణిలతో ప్రదీప్ చేసే కామెడీని గత కొంతకాలం నుంచి మిస్ అవుతూ వస్తోన్న ఫ్యాన్స్‌ను మళ్లీ అలరించేందుకు వచ్చేస్తున్నాడు. షూటింగ్‌లో గాయపడిన ప్రదీప్ తన కాలు ఫ్యాక్చర్ కావడంతో కొన్ని రోజులు ప్రోగ్రామ్‌లకు దూరంగా ఉండిపోయాడు. చాలా గ్యాప్ ఇచ్చిన ప్రదీప్ ఈటీవీకి సంబంధించిన ప్రోగ్రామ్‌లో కనిపించడం మానేశాడు.
Recommended Video

ఢీ షోలో ఎంటర్ అయిన ప్రదీప్..
అయితే జీ చానెల్‌లో కనిపించిన ప్రదీప్.. ఇకపై ఢీ షోలో కనిపించడనే టాక్ నడిచింది. తెలుగు భాష లెక్కా ఆడా ఉంటా.. ఈడా ఉంటా అనే డైలాగ్‌లా ప్రదీప్ ఆ చానెల్‌లో కొత్త ప్రోగ్రామ్ చేస్తూనే.. తన ఢీ షోను కూడా చేయబోతోన్నాడని తెలుస్తోంది. రీసెంట్‌గా ఢీ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేసినట్లు దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











