For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బుల్లితెరపై సందడి చేసేందుకు యాంకర్ ప్రదీప్ రెడీ.. అదిరిపోయిన ఎంట్రీ.. ఇక మళ్లీ షోలతో బిజీ బిజీ

  |

  బుల్లితెరపై యాంకరింగ్‌లో టాప్ పొజిషన్‌లో సుమ కనకాల తరువాత ఆమె వెనకాల ఉండేంత స్టఫ్ ఉన్న యాంకర్ ఒక్క ప్రదీప్ మాత్రమే. ఢీ షోతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. మేల్ యాంకర్‌లో మకుటం లేని మహారాజులా వెలిగిపోతోన్న ప్రదీప్‌పై, అతని ఆరోగ్యంపై రకరకాల వార్తలు ప్రచారం జరిగాయి. అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడనే రూమర్స్ ఊపందుకోగా అతని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

  ఢీ షోలో వేసే పంచ్‌లు

  ఢీ షోలో వేసే పంచ్‌లు

  ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సుల కోసం మాత్రమే చూసేవాళ్లు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎప్పుడైతే ప్రదీప్ ఢీ పగ్గాలను చే పట్టాడో.. సుధీర్, రష్మీ జాయిన్ అయ్యారో షో స్వరూపమే మారిపోయింది. వీరితో జడ్జ్‌గా ఉన్న శేఖర్ మాష్టర్ కూడా వేసే పంచ్‌లు పేలుతూ ఉంటాయి. వీరంతా కలిసి చేసే ఫన్ కోసమే ఢీ షోను చూస్తున్నారు.

  గ్యాప్ ఇచ్చే సరికి రూమర్స్..

  గ్యాప్ ఇచ్చే సరికి రూమర్స్..

  అయితే ప్రదీప్ గత కొన్ని రోజులుగా ఢీ షోలో కనబడటం లేదు, మొన్న దీపావళికి చేసిన స్పెషల్ ప్రోగ్రామ్‌లోనూ కనబడలేదు.. కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా అనే షోకూ రావడం లేదు. దీంతో అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎన్నో అనుమానాలు రేకెత్తసాగాయి. ఇక సోషల్ మీడియాలోనైతే రూమర్లకు అంతే లేకుండా పోయింది. ప్రదీప్‌కి అరుదైన వ్యాధి సోకిందనే వార్తలు వైరల్ అయ్యాయి.

  ఆన్‌లైన్‌లోకి వచ్చి క్లారిటీ..

  ఆన్‌లైన్‌లోకి వచ్చి క్లారిటీ..

  ఇక తనపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టేందుకు ప్రదీపే స్వయంగా రంగంలోకి దిగాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్‌కు వచ్చి నెటిజన్లతో ముచ్చటించాడు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని, షూటింగ్‌లో కాలికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకున్నానని, త్వరలోనే షోలో పాల్గొనబోతోన్నానని క్లారిటీ ఇచ్చేశాడు.

  అదిరిపోయిన ఎంట్రీ..

  ఢీ, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా లాంటి షోల్లో చేసే కామెడీ వేసే పంచ్‌లు ఓ లెక్క అయితే.. దీపావళి, దసరా, న్యూ ఇయర్ అంటూ ప్రత్యేకంగా చేసే ఈవెంట్లలో ప్రదీప్ చేసే రచ్చ మరొక ఎత్తు. చాలా రోజులు గ్యాప్ ఇచ్చాక ఓ అదిరిపోయే ఈవెంట్‌తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఈవెంట్‌తో మళ్లీ ప్రదీప్ కమ్‌బ్యాక్ అనిపించుకున్నాడు.

  #CineBox : Balakrishna To Play Sr NTR Again? Priyanka Chopra Bought A Lavish House
  అల్లు అర్జున్ డైలాగ్‌తో..

  అల్లు అర్జున్ డైలాగ్‌తో..

  అల వైకుంఠపురములో సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. నా పేరు సూర్య చిత్రంతో చాలా గ్యాప్ రావడంపై.. ఈ సినిమాలోని ఓ పంచ్‌తో క్లారిటీ ఇచ్చాడు. గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటూ తన స్టైల్లో చెప్పేశాడు. సేమ్ టు సేమ్ అదే ఫార్మాట్‌లో మన ప్రదీప్ కూడా చెబుతున్నాడు. గ్యాప్ ఇవ్వలా.. వచ్చింది అంటూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

  English summary
  Anchor Pradeep Came With A Special Event. Reacently Rumors Spreda Over On Anchor Pradeep Health Condition. Later he Clarified That He Is Fine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X