మానసికంగా మానభంగం చేస్తున్నారు.. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు.. ఆ వార్తలపై ప్రదీప్ ఫైర్

తాజాగా యాంకర్ ప్రదీప్ వార్తల్లో నిలిచాడు. గత రెండు మూడు రోజులుగా ప్రదీప్‌పై ఘోరమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ఓ యువతి తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడినట్టు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అందులో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఆ జాబితాలో యాంకర్‌ ప్రదీప్‌ పేరు కూడా ఉండటంతీ మీడియాలో బాగానే వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ఆరోపణలపై ప్రదీప్ స్పందించాడు.

 చాలా బాధాకరంగా..

చాలా బాధాకరంగా..

అందరికీ నమస్కారం.. సోషల్ మీడియా, యూట్యూబ్‌లో గత రెండు మూడు రోజులుగా నాపై ఆరోపణలు వస్తున్నాయి. అవి నాకు చాలా బాధాకరంగా అనిపించాయి. నిజానిజాలు తెలుసుకోకుండా..వాళ్లకు వాళ్లే నిర్దారణ చేసుకుని అదే నిజమనుకుని నా ఫోటోలను వాడుకుని నా పేరు మీద హెడ్డింగ్‌లు పెడుతూ ఆర్టికల్స్ చేయడం, పబ్లిష్ చేయడం ఇదంతా ఎంత దారుణమైంది అని ప్రదీప్ ఎమోషనల్ అయ్యాడు.

ఆలోచించకుండా..

ఆలోచించకుండా..

ఇలాంటి అతి సున్నితమైన అంశం, అలాంటి టాపిక్‌లో ఈ అబ్బాయి పేరు ఎందుకు ఉంది అని కూడా ఎవ్వరూ ఆలోచించలేదు యాంకర్ ప్రదీప్ పేరు వినిపించగానే టపా టపా రాసేయడం, అవతలి వ్యక్తులు ఏ ఉద్దేశ్యంతో చెప్పారు.. ఎందుకు చెప్పారు.. ఎవరు చెప్పించారు.. అనేది ఏది ఆలోచించకుండా పేరు వినపడగానే ట్రోల్ చేయడం, వార్తలు రాయడం, దారుణంగా తిట్టడం, అవతలి వారి కుటుంబంలో ఏం జరిగిందో మా కుటుంబానికి అలానే చేస్తామని అనడం ఎంత దారుణంమని ప్రదీప్ ప్రశ్నించాడు.

వ్యూస్ కోసం..

వ్యూస్ కోసం..

ఓ వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా... టార్గెట్ చేసి సోషల్ ట్రోలింగ్ చేసేస్తారా? దాని మీద ఒకర్ని చూసి మరొకరు టపా టపా టైప్ చేసి ఫోటోలు పెట్టేసి న్యూస్ చేసేస్తే వ్యూస్ వస్తాయ్.. ఆ వ్యూస్ ఎందుకు పనికొస్తాయ్..ఏం జరుగుతుంది. అది మంచి పద్దతా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదా అని యాంకర్ ప్రదీప్ అన్నాడు.

Recommended Video

Checkmate Movie Trailer | Anchor Vishnupriya చెక్ మేట్ ట్రైలర్, విష్ణుప్రియ యమ హాట్ గురూ !
మానసికంగా మానభంగం..

మానసికంగా మానభంగం..

నిజం తెలియాలి కదా.. అంటే అప్పటి వరకు ఎదురుచూడకుండా ఒకర్ని మించి ఒకరు.. వాళ్లు అలా పెట్టారు.. మనం ఇలా పెడదాం.. ఇంకా వెరైటీ పెడదాం.. డిక్లేర్ చేద్దాం.. అంటూ ఇలా చేస్తూ ఉంటే..కొద్ది పాటి చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ దానికి నిజం తెలిసే లోపల నాకు గానీ నా కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అవుతారు..ఇది ఎంత మెంటల్ ట్రామానో తెలుసా? ఇది మానసిక మానభంగం చేస్తున్నట్టు. ఎంత దారుణమైన స్థితిలోకి తీసుకెళ్తున్నారో తెలుసా? అని ప్రదీప్ బాధపడ్డాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X